పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ హిమపాతంలో గల్లంతైన 10మంది పర్వతారోహకులలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరణించిన వారిలో నేపాలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా(43) కూడా ఉన్నారు.మిగతా పర్వతారోహకుల కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రతికూల వాతావరణం, కఠినమైన భూభాగం కారణంగా హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
కారకోరమ్ పర్వతశ్రేణిలోని 8,051 మీటర్ల ఎత్తయిన బ్రాడ్‌పీక్‌ను బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్ మాజీ సభ్యుడు, నేపాలీ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సారథ్యంలోని 10 మంది పర్వతారోహకుల బృందం అధిరోహించేందుకు ప్రయత్నించింది. చైనా సరిహద్దుకు సమీపంలో గిల్గిట్–బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతారోహకులకు అత్యంత సవాళ్లతో కూడిన పర్వతాల్లో ఒకటిగా కొనసాగుతుంది.
ఆరు నెలల్లో నిర్మల్ పుర్జా 14 శిఖరాలు అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించాడు. పూర్జా సాధించిన ఘనతను ‘14 పీక్స్: నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్’పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేశారు. పూర్జా 9 మంది నేపాలీ పర్వతారోహకులతో కలిసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన కే2 పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు పూర్జా బ్రిటిష్ సైన్యంలో 16 ఏళ్లు సేవలందించారు. 2018లో మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు. పర్వతారోహణలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న పుర్జా చివరకు బ్రాడ్ పిక్ పర్వతారోహణ క్రమంలో మరణించడం విషాదం రేపింది.