Lion Attack | టాయిలెట్‌కు వెళ్లిన వ్యాపారవేత్త.. దాడి చేసి చంపిన సింహాం..
Lion Attack | ఓ వ్యాపారవేత్తపై సింహాం( Lion ) మెరుపు వేగంతో దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆఫ్రికా( Africa )లోని నమీబియా( Namibia )లో వెలుగు చూసింది.

Lion Attack | ఓ వ్యాపారవేత్తపై సింహాం( Lion ) మెరుపు వేగంతో దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆఫ్రికా( Africa )లోని నమీబియా( Namibia )లో వెలుగు చూసింది.
వ్యాపారవేత్త బెర్న్‌డ్ కెబెల్( Bernd Kebbel ).. తన భార్య, స్నేహితులతో కలిసి నమీబియాలోని హోయనిబ్ స్కెలిటన్ కోస్ట్ క్యాంప్‌కు వెళ్లాడు. స్థానికంగా ఉన్న సఫారీ లాడ్జిలో వీరంతా బస చేశారు. ఇక అర్ధరాత్రి వేళ టాయిలెట్‌కని వ్యాపారవేత్త బెర్న్‌డ్ కెబెల్ తన క్యాంపు నుంచి బయటకు వెళ్లాడు.
అలా వెళ్లిన వెంటనే.. అతనిపై ఓ సింహాం మెరుపు వేగంతో దాడి చేసి చంపింది. అక్కడున్న వారంతా సింహాం బారి నుంచి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాడి అనంతరం సింహాం అటునుంచి పారిపోయింది. బిజినెస్‌మెన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి భార్య గుండెలవిసేలా రోదించింది.
ఇక నిత్యం స్థానికులు, పర్యాటకులపై దాడి చేస్తున్న ఆ సింహాన్ని జూన్ 1వ తేదీన అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కలిసి చంపేశారు. నమీబియా ప్రాంతం ఎడారి సింహాలకు ప్రసిద్ధి గాంచింది. 2023 గణాంకాల ప్రకారం 60 పెద్ద సింహాలు, డజన్ వరకు పిల్ల సింహాలు ఉన్నట్లు తేలింది. ఇటీవల వీటి సంఖ్య తగ్గింది. కరువు కారణంగా ఆహార వనరులు లేకపోవడంతో.. మనషులపై సింహాలు దాడులు చేయడం ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.