ఇరాన్‌ అధ్యక్షుని హెలికాప్టర్‌ను లేజర్‌ వెపన్‌తో పేల్చేశారా?

డయానా వాలెస్‌ అనే తన ఎక్స్‌ ఖాతాలో ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గాలిలో హెలికాప్టర్‌ పేలి మండుతున్న ఫొటోను కూడా ఆయన తన ట్వీట్‌తో జత చేశారు

ఇరాన్‌ అధ్యక్షుని హెలికాప్టర్‌ను లేజర్‌ వెపన్‌తో పేల్చేశారా?

విధాత : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై కుట్ర కోణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. బెల్ 212 హెలికాప్టర్ కూలి ఆదివారం సాయంత్రం రైసీ మరణించారు. అయితే అది ప్రమాదం కాదని, అంతరిక్షం నుంచి అత్యాధునిక అత్యధిక లేజర్ వెపన్‌తో హెలికాప్టర్‌ను పేల్చి ఉంటారన్న కథనాలు ఆన్‌లైన్‌లో వ్యక్తమవుతున్నాయి. ఇదే సందేహాన్ని వ్యక్తం చేసిన నెటిజన్‌ డయానా వాలెస్ తన ఎక్స్ ఖాతాలో గాలిలో హెలికాప్టర్ పేలి మండుతున్న ఫోటోను ట్వీట్‌తో జత చేసి అంతరిక్షం నుంచి లేజర్‌ వెపన్‌తో హెలికాప్టర్‌ను పేల్చి ఉంటారాన్న సందేహం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుని మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్‌ ఇటీవల రష్యాతో కలసి బ్రిక్స్‌ దేశాల మధ్య ఒకే కరెన్సీ చెలామణి గురించి చర్చలు జరుపడం కూడా నాటో దేశాలకు నచ్చ లేదు. నాటో దేశాలతో సరిపడని అనేక దేశాల అధినేతలు గతంలో ఏదో ఒక ప్రమాదంలో మరణించడం కూడా చరిత్రలో ఉన్నదే. అత్యాధునిక లేజర్ బీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి ఆయన హెలికాప్టర్ ని కూల్చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ఎక్స్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే 10 దేశాలు ఇటువంటి ఆయుధాలను వాడటాన్ని నెటిజన్లు ఉదహరిస్తున్నారు.

ఇరాన్ అణుశాస్త్రవేత మెహసీన్ ఫక్రుజాదను గతంలో ఇజ్రాయెల్ అత్యాధునిక రోబోల సహాయంతో అంతమొందించడంతో పాటు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. అదే తరహాలో రైసీ హత్యకు ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధాలను వాడి ఉండవచ్చన్న అనుమానాలతో కూడిన కథనాలు సైతం వెలువడుతున్నాయి. అయితే ఇరాన్ అధికారిక వర్గాలు మాత్రం ఈ కథనాలను దృవీకరించలేదు. ప్రస్తుతానికి రైసీ మరణాన్ని హెలికాప్టర్ ప్రమాదంగానే దృవీకరించారు.

కాగా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జావిద్ జారీఫ్ మాత్రం అమెరికానే రైసీ మరణానికి కారణమని ఆరోపించారు. తమ హెలికాప్టర్లకు అవసరమైన విడిభాగాలు కొనుగోలు చేయనీకుండా విధించిన ఆంక్షలు అధ్యక్షుని ప్రాణాలను బలి తీసుకున్నట్లు పేర్కోన్నారు. ఆంక్షల కారణంగా ఇరాన్ కొత్త విమానాలు, హెలికాప్టర్లు చేయలేక, పాత వాటికి విడిభాగాల సేకరణ చేసుకోలేక రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో పాత వాటి విడిభాగాలను రిపేర్లకు వాడుతుండటంతో చాపర్ల ప్రమాదాలకు కారణమవుతుందని ఆయన ఆరోపించారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ 1979కి ముందు కొనుగోలు చేసిందేనని తెలుస్తోంది.

వారసత్వ పోరుపై అనుమానాలు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం వెనుక ఇరాన్ పాలన వారసత్వ పోరు కూడా ఉండవచ్చని కథనాలు వెలుబడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ వ్యవహారిస్తున్నారు. ఆయన తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చని ఆ దేశ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగింది. ఖమేనీ కుమారుడు ముస్తాజబా కూడా సుప్రీం లీడర్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. రైసీ మరణంతో ఇక ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముస్తాజాబాకు దక్కడం ఖాయమని అమెరికా విదేశాంగ మాజీ సలహాదారు గాబ్రియన్ నోర్నహా ఎక్స్ లో పోస్ట్ చేయడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మహమ్మద్ ముఖ్‌బేర్‌ మరో 50 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు