Donald Trump| నా ప్రెస్ సెక్రటరీ మస్తు బ్యూటీఫుల్: డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో అందరిని విస్తు పరిచారు. ఈసారి తన ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్(28) సౌందర్యంపై ఆయన బహిరంగ వేదికపై పొగడ్తలు గుప్పించి అందరిని విస్మయానికి గురి చేశారు.

Donald Trump| నా ప్రెస్ సెక్రటరీ మస్తు బ్యూటీఫుల్: డోనాల్డ్ ట్రంప్

విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో అందరిని విస్తు పరిచారు. ఈసారి తన ప్రెస్ సెక్రటరీpress secretary కరోలిన్ లీవిట్(Caroline Levitt 28) సౌందర్యంపై ఆయన బహిరంగ వేదికపై పొగడ్తలు గుప్పించి అందరిని విస్మయానికి గురి చేశారు. నా ప్రెస్ సెక్రటరీ చాల అందమైన మహిళ అని, ఆమె మాట్లాడటం మొదలు పెడితే..ఆమె పెదవులు లైట్ మెషిన్ గన్నే అని పొగిడారు. ఆమెను ఫాక్స్ వంటి టీవీ స్క్రీన్ పై పెడితే..అదుర్స్ అని, ఫాక్స్ ఛానెళ్ల చర్చల్లో ఆమె ఆధిపత్యం చెలాయించారు అన్నారు. ఆమెను మించిన ప్రెస్ సెక్రటరీ ఇంకెవరికి ఉండి ఉందరని ఆమెను ఆకాశానికెత్తారు. అందం, హుందాతనంతో ప్రజల్లో ఓ స్టార్‌ గా మారిపోయిందని పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో ఓ సభకు ఆమెను వెంట తీసుకొచ్చి వేదిక ఎక్కించడంతో ఆగకపోగా..ఆమె అందాలపై కవిత్వం చెప్పడంతో ఆ సభకు హాజరైన జనం విస్తుపోయారు.

ప్రసంగం మధ్యలో 79 ఏళ్ల ట్రంప్ ఆమెను వేదికపైకి పిలిచారు. మన సూపర్ స్టార్ కరోలిన్ ఇక్కడే ఉన్నారు. ఆమె అద్భుతం కాదా?” అని అడుగుతూనే ఆమె రూపాన్ని పొగడటం మొదలుపెట్టారు. లీవిట్ శారీరక సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు. గతంలో ఆగస్టులో కూడా న్యూస్‌మ్యాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివిట్ అందంపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన ప్రభుత్వ ఆర్థిక విజయాల గురించి ప్రసంగించాల్సిన సభలోట్రంప్ ప్రెస్ సెక్రటరీ సౌందర్య భజన చేయడం సభికులను ఆశ్చర్యపరిచింది. ట్రంప్ తమ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ లీవిట్ పని కొంచెం సులువే అని అన్నారు. “ఆమెకు ఏ భయం లేదు… ఎందుకంటే మన దగ్గర సరైన విధానం ఉంది. మనకు మహిళల క్రీడలలో పురుషులు లేరు అంటూ చెప్పుకొచ్చారు.

వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ చరిత్రలో లీవిట్‌(28) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు. ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిసియో (60)ను వివాహం చేసుకున్నారు. వారికి నికో అనే కుమారుడు ఉన్నాడు.

ఈజిప్టు వేదికగా జరిగిన గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనిపై ట్రంప్ అందంపై కూడా ట్రంప్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. “మీరు అందంగా ఉన్నారు, అనడానికి అభ్యంతరం లేదు కదా?” అంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.