Mexico | మెక్సికోలో ‘ఎన్నికల’ హింస.. 22 మంది దుర్మరణం

Mexico | మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో ఎన్నికల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి హింస చెలరేగింది. ఎన్నికల్లో పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 14 మంది మరణించారు. ఇవాళ (ఆదివారం) ఉదయం కూడా మాపస్టేపెక్ నగరంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నికోలస్ నోరీగా అనే అభ్యర్థి కారు లక్ష్యంగా దాడి జరిగింది.

Mexico | మెక్సికోలో ‘ఎన్నికల’ హింస.. 22 మంది దుర్మరణం

Mexico : మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో ఎన్నికల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి హింస చెలరేగింది. ఎన్నికల్లో పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 14 మంది మరణించారు. ఇవాళ (ఆదివారం) ఉదయం కూడా మాపస్టేపెక్ నగరంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నికోలస్ నోరీగా అనే అభ్యర్థి కారు లక్ష్యంగా దాడి జరిగింది.

ఈ దాడిలో నికోలస్‌ నోరిగా గాయపడ్డాడు. ఈ దాడిలో కనీసం ఐదుగురు మరణించారు. మెక్సికోలో జూన్ 2న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చియాపాస్‌లో గత కొన్ని రోజులుగా హింస చెలరేగుతున్నది. స్థానిక సాయుధ గ్రూప్‌లు ప్రాంతీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరించడం, మాట వినకపోతే దాడులు చేసి చంపడం లాంటి ఘటనలతో పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నాయి.

అంతేగాక ఈ ఏడాది రాజకీయంగా ప్రేరేపించబడిన దాడుల్లో కనీసం 134 మంది మరణించారు. వీరిలో 24 మంది రాజకీయ అభ్యర్థులు ఉన్నారు. రెండు రోజుల క్రితం గ్వాటెమాల సరిహద్దు నుంచి 80 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ముష్కరుడు ఓ ర్యాలీపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక యువతి, మేయర్ అభ్యర్థి లూసెరో లోపెజ్ మజాతో సహా ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

ఈ నెల 13న చికోముసెలో సమీపంలో జరిగిన కాల్పుల్లో 11 మంది పౌరులు మరణించారు. అదేవిధంగా ఏప్రిల్‌లో మొరెనా అధ్యక్ష అభ్యర్థి క్లాడియా షీన్‌బామ్‌ను గ్వాటెమాల సరిహద్దు సందర్శనలో ఉండగా ముసుగులు ధరించిన వ్యక్తులు అడ్డుకుని దాడికి ప్రయత్నించినది కూడా ఇక్కడే కావడం గమనార్హం.