Elon Musk | ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని పక్కనపెట్టాలి..! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..!
Elon Musk | ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగాన్ని పక్కన పెట్టాల్సిందేనని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. ఈవీఎంలు హ్యాకింగ్ బారినపడే అవకాశాలున్నాయన్నారు. పోర్టూరీకో దేశంలో దేశంలో ఈవీఎంల్లో అవకతవకలు బయటపడిన సందర్భంలో మస్క్ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Elon Musk | ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగాన్ని పక్కన పెట్టాల్సిందేనని ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. ఈవీఎంలు హ్యాకింగ్ బారినపడే అవకాశాలున్నాయన్నారు. పోర్టూరీకో దేశంలో దేశంలో ఈవీఎంల్లో అవకతవకలు బయటపడిన సందర్భంలో మస్క్ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలను వాడకూడదని.. వాటిని ఏఐ, మనుషులు హ్యాక్ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నా.. ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని తీవ్రమైన ప్రమాదంగా పరిగణించాలన్నారు. ఇటీవల పోర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అనేక అవకతవకలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఈవీఎంలకు అనుసంధానంగా ఓట్ల స్లిప్స్‌లు కూడా ఉండడంతో తప్పు ఎక్కడ జరిగిందో అధికారులు వెంటనే గుర్తించిన అధికారులు ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టగలిగారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు కెన్నడీ బంధువు రాబర్ట్ కెన్నెడీ చేసిన పోస్ట్‌ను చేశారు. ఓటు స్లిప్పులు లేని సందర్భాల్లో పరిస్థితి ఏంటని రాబర్ట్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు. ఈవీఎంలతో ప్రమాదాలకు సంబంధించిన ఓ అధ్యయనాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికాలో ఈవీఎంలపై మక్కువ వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే, భారత్‌లోనూ ఈవీఎంల భద్రతపై సైతం ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే, టాంపరింగ్‌కు అవకాశం లేని ఎం-3 ఈవీఎంలను భారత్ వినియోగిస్తుంది. టాంపరింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నించిన సమయంలో ఈవీఎంలు సేఫ్టీ మోడల్‌కి వెళ్లి నిరుపయోగంగా మారిపోతాయి. భారత్‌లోని ఈవీఎంలను ఆధునికీకరించడంలో ఐఐటీలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికల కమిషన్‌కు చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ సైతం ఈవీఎం భద్రత విషయంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటుంది. భారత్‌లోని ఈవీఎంలు ఇతర దేశాల్లోని వాటికంటే చాలా భిన్నమైనవని ఐఐటీ బాండే ప్రొఫెసర్ దినేశ్ కే శర్మ చెప్పారు. ఎం3 ఈవీలకు ఇతర డివైజ్‌లతో ఎలాంటి కనెక్షన్ ఉండదని, వాటికి కనీసం విద్యుత్ కనెక్షన్ ఉండదని అన్నారు. ఈవీఎంల సమగ్రత, భద్రతకు వీవీపాట్ యంత్రాల వినియోగం పెంచిందని సైతం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram