గర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్‌కి ఎప్పుడైనా గుర‌య్యారా? అంటే ఏంటి…

గర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్‌కి ఎప్పుడైనా గుర‌య్యారా? అంటే ఏంటి…

సోష‌ల్ మీడియాలో ఒక్కోసారి ఒక్కో ఛాలెంజ్ లేదా అంశం వైర‌ల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు విదేశీ టిక్‌టాక్‌, ఎక్స్ ఎకౌంట్లో గ‌ర్ల ఫ్రెండ్ ఎఫెక్ట్ (Girl Fried Effect) పేరుతో అనేక పోస్టులు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎంటీ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్ అనుకుంటున్నారా? ప్రేమలో ప‌డితే లేదా వివాహ బంధంలో అడుగుపెడితే మ‌న‌లో వ‌చ్చే హార్మోన్ మార్పుల వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌లు పేర్కొన్న విష‌యం తెలిసిందే.




అంతే కాకుండా ప్రియురాలు లేదా భార్య‌తో గాఢ ప్రేమ‌లో మునిగిపోయిన అబ్బాయిలు.. ప్రేమ‌లో ప‌డ‌క‌ముందు కంటే ఎక్కువ అందంగా మారతార‌ని చెప్ప‌డ‌మే ఈ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్ ఉద్దేశం. ఇందులో భాగంగా టిక్ టాక్, ఎక్స్ యూజ‌ర్లు ప్రేమ‌లో ప‌డ‌క‌ముందు త‌మ ప్రియుడి ఫొటోను, ప‌డ్డాక త‌మ‌తో క‌లిసి ఉన్న ఫొటోను పెట్టి.. చూడండి ఎంత అందంగా మారిపోయాడో.. ఇది గ‌ర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.




అయితే రిలేష‌న్‌షిప్ నిపుణులు దీనిపై మాట్లాడుతూ.. ప్రేమ‌లో ప‌డితే ప్ర‌తి అబ్బాయీ హాలీవుడ్ హీరో టాం క్రూజ్‌లా అవ్వ‌క‌పోవ‌చ్చు కానీ.. అమ్మాయిలు త‌మ‌కున్న ఫ్యాష‌న్ అవ‌గాహ‌న‌తో వారిని కాస్త నూత‌నంగా మారుస్తార‌ని పేర్కొన్నారు.




అబ్బాయి జీవితంలోకి అమ్మాయి ప్ర‌వేశించ‌గానే వారి స్టైల్‌ను మార్చ‌డానికి అమ్మాయిలు కాస్త ఎక్కువ దృష్టి పెడ‌తారు. ఇదే వారిని ముందుకంటే కాస్త అందంగా క‌నిపించేలా చేస్తుంది అని ఈ ఛాలెంజ్‌పై రాసిన క‌థ‌నంలో న్యూయార్క్ పోస్ట్ అభిప్రాయ‌ ప‌డింది.




అయితే అన్ని గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్ వ‌ల్లా కొన్ని ప్ర‌తికూల అంశాలు ఉన్నాయి. గ‌ర్ల్ ఫ్రెండ్ ఎఫెక్ట్ వ‌ల్ల అబ్బాయిలు త‌మ‌దైన వ్య‌క్తిత్వాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ల్యాడ్ బైబిల్ పేర్కొంది. అబ్బాయిలు ఒక బంధంలో చిక్కుకుపోతే లేదా మునిగిపోతే.. వారి వార్డ్‌రోబ్ గ‌తంలోలా ఉండ‌దు. అంటే మీ వ్య‌క్తిత్వాన్ని, మీదైన అస్తిత్వాన్ని కోల్పోయిన‌ట్లే క‌దా అని అభిప్రాయ‌ప‌డింది.