Imran Khan Wife Bushra Bibi : ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17ఏళ్ల జైలు శిక్ష
తోషాకానా-2 అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయ కక్ష అని ఇమ్రాన్ వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 17ఏళ్ల జైలు శిక్ష పింది. తోషాకానా-2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక కోర్టు ఈ జైలు శిక్షను ఖరారు చేసింది. 2021లో సౌదీ ప్రభుత్వం అందజేసిన కానుకలను ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా అక్రమంగా వాడుకున్నారన్న అభియోగాలతో తోషాకానా కేసు నమోదు చేశారు. సౌదీ చక్రవర్తి బల్గేరి జ్వలరీ సెట్‌ను ఇమ్రాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. మే 2021 అధికారిక పర్యటన సమయంలో ఆ బహుమతి అందజేశారు.
అయితే ఆ ఖరీదైన గిఫ్ట్‌ను ఇమ్రాన్ తక్కువ ధరకే అమ్ముకున్నట్లు ఆరోపణలతో అవినీతి కేసు నమోదైంది. ఈ నగల సెట్ విలువ పాకిస్తాన్ కరెన్సీలో 7.15 కోట్ల రూపాయలకు పైమాటే. దీన్ని 58 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ నిబంధనలు ఉల్లంఘించారని దర్యాప్తులో తేల్చారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం తనపై రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసుగా కోర్టులో వాదించారు. ఈ కేసు విచారణ పూర్తవ్వడంతో స్పెషల్ కోర్టు జడ్జీ షారూక్ అర్జుమంద్ తీర్పును వెలువరించారు. రావల్పిండిలోని హైసెక్యూర్టీ ఉన్న అదియాలా జైలులో తీర్పును వెల్లడించారు. కోర్టు ఇమ్రాన్ చర్యను ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, మోసపూరితం, అత్యంత అవినితిమయమైన చర్యగా పేర్కొంది.
పాకిస్థాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 కింద ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాకు ప్రత్యేక న్యాయమూర్తి షారుఖ్ అర్జుమాండ్ పదేళ్ల శిక్ష వేశారు. ఇక అవినీతి చట్టం కింద మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. అలాగే అదనంగా ఇమ్రాన్ దంపతులు ఒక్కొక్కరిపై 10 మిలియన్ల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించకుంటే అప్పుడు ఇమ్రాన్, బుష్రాలకు అదనపు జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇమ్రాన్, బుష్రా లీగల్ బృందాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ 14 సంవత్సరాల జైలుశిక్షను ఎదుర్కొంటు ఇదే అదియాల జైలులో ఉన్నారు. తోషాకానా-2 కేసులో ఇమ్రాన్ కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడగానే.. పాకిస్తాన్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి :
Mega Project | పవన్–అల్లు అర్జున్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధం .. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్?
Revanth Reddy : పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..18మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram