Revanth Reddy : పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..18మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన ఫలితాలు సాధించని వారికి టెలికాన్ఫరెన్స్ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Revanth Reddy : పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..18మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్

విధాత, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ లు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీక్షా వివరాలను మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో విఫలమైన వరంగల్, మహబూనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన 18మంది ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్ చార్జీలపై ఈ సందర్బంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై పీసీసీ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్‌ను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్‌ అయినట్టు తెలిసింది. భవిష్యత్‌లో ఇది రిపీట్‌ అయితే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్‌ ఇచ్చినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు రెండు, మూడు రోజులగా సమీక్ష జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సింహ భాగం సర్పంచ్ స్థానాలను సాధించి జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,702 పంచాయతీ సర్పంచి పదవులకు గాను.. తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 8,335 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,511 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 710 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించింది.

ఇవి కూడా చదవండి :

SIR voter deletion|తమిళనాడులో ఎస్ఐఆర్ రగడ..97.37లక్షల ఓట్ల తొలగింపు
ACB cases weakened|సర్కార్ నిర్వాకం..ఏసీబీ కేసుల నిర్వీర్యం