Minister kiss | విశ్వవేదికపై దేశాధ్యక్షుడికి ముద్దు.. అందరి ముందే హద్దులు మరిచిన మహిళా మంత్రి..!

Minister kiss | వేదికపై ప్రపంచ దేశాల నలుమూలల నుంచి వచ్చిన నేతలు ఆసీనులై ఉన్నారు. ఆట్టహాసంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు లేచి నిలబడి అతిథులందరికీ అభివాదం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ దేశ క్రీడా శాఖ బాధ్యతలు చూస్తున్న మహిళా మంత్రి కూడా లేచి అభివాదం చేయడం మొదలుపెట్టారు.

Minister kiss | విశ్వవేదికపై దేశాధ్యక్షుడికి ముద్దు.. అందరి ముందే హద్దులు మరిచిన మహిళా మంత్రి..!

Minister kiss : వేదికపై ప్రపంచ దేశాల నలుమూలల నుంచి వచ్చిన నేతలు ఆసీనులై ఉన్నారు. ఆట్టహాసంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఆ దేశానికి చెందిన అధ్యక్షుడు లేచి నిలబడి అతిథులందరికీ అభివాదం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ దేశ క్రీడా శాఖ బాధ్యతలు చూస్తున్న మహిళా మంత్రి కూడా లేచి అభివాదం చేయడం మొదలుపెట్టారు. అభివాదం చేస్తూ అధ్యక్షుడికి దగ్గరికి వెళ్లి ఓ ఊహించని చర్యకు పాల్పడ్డారు. అధ్యక్షుడిని బిగ్గరగా పట్టుకుని గట్టిగా కిస్‌ చేశారు. దాంతో అధ్యక్షుడు కూడా ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు.

ఈ హఠాత్పరిణామానికి వేదికపై ఉన్న ప్రముఖులంతా బిత్తరపోయారు. ఇక్కడ ముద్దు పెట్టింది ఫ్రాన్స్‌ క్రీడా శాఖ మంత్రి ఎమిలీ కాస్టెరా అయితే.. ముద్దు పెట్టింది ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌. పారిస్‌ ఒలింపిక్స్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ముద్దు ఘటన జరిగినప్పుడు పక్కనే ఉన్న ఫ్రాన్స్‌ ప్రధాని గాబ్రియల్ అట్టాల్‌ ఇబ్బందిగా ముఖం తిప్పుకోవడం కనిపించింది.

అయితే ఈ ముద్దు ఇప్పుడు దుమ్ముదుమారంగా మారింది. ఈ దృశ్యాన్ని ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ మాడమ్‌ ఫిగారో ప్రచురించింది. దాంతో ఆ దేశమంతటా ఈ విషయం చర్చనీయాంశమైంది. మాడమ్‌ ఫిగారో ప్రచురించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ఓ గొప్ప కార్యక్రమంలో ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వారిద్దరూ ప్రేమలో ఉన్నారేమోనని, కానీ అందరి ముందు ఇలా ముద్దులు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఉన్నతంగా ఉండాల్సిన వారు ఇలా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.