మెరుగైన ఫీచర్లతో ఐ ఫోన్ 16..! సోషల్ మీడియాలో లీక్స్ వైరల్..!

విధాత: ఆపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ను తీసుకువస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి ప్రపంచవ్యాప్తంగా 15 సిరీస్ ఐఫోన్స్ మోడల్స్ అమ్మకాలు మొదలయ్యాయి. భారత్‌లోనూ ఐఫోన్ 15 ధర రూ.79,990 వద్ద ప్రారంభమైంది. అయితే, ఆపిల్ యూజర్ల కొత్త సిరీస్‌లో కొన్ని అదనంగా స్పెసిఫికేషన్ ఉండవచ్చని భావించారు.
అయితే, గతంలోని మోడల్స్‌లాగే ఉండడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, ఈ స్పెసిఫికేషన్స్ 16 సిరీస్‌లో యాడ్ చేసే అవకాశాలున్నాయి. వాస్తవానికి 15 సిరీస్‌లో 120 హెర్ట్‌జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటును ఆశించినా.. కంపెనీ 60 హెర్ట్‌జ్ రేట్‌ను కొనసాగించింది. తాజాగా ఐఫోన్ 16 సిరీస్‌పై యాపిల్ పని చేస్తున్నది. ఈ సిరీస్‌కు సంబంధించి వివరాలు కొన్ని లీక్ అయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 16 బేస్ మోడల్‌లో 120 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించనున్నట్లుగా తెలుస్తున్నది.
ఇప్పటి వరకు కంపెనీ బేస్ మోడల్‌లో 60 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేట్‌నే కొనసాగిస్తూ వస్తున్నది. ఇక ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచెస్ డిస్‌ప్లేను, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. అయితే, అదే సమయంలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల్లో 6.1, 6.7 అంగుళాల డిస్‌ప్లేను అవకాశాలున్నాయి. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో లైనప్‌తో సాలిడ్ స్టేట్ బటన్‌ను పరిచయం చేయాలని భావించింది. ఇది ఐఫోన్ ఎస్ఈ సిరీస్ హోమ్ బటన్‌లో కనిపించే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. ఐఫోన్ 15 ప్రోలో అందించనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లో కంపెనీ సాలిడ్ స్టేట్ బటన్‌ను అందించే అవకాశం ఉందని ఆపిల్ ఉత్పత్తులను విశ్లేషకుడు మింగ్ చి కుయో పేర్కొన్నారు.
ఆపిల్ 16 సిరీస్ 2024లో జరిగే ఆపిల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నది. కొత్త సిరీస్‌లోని బేస్ మోడల్స్‌లో A17 చిప్‌సెట్‌ను, ప్రో మోడల్స్‌లో ఏ18 ప్రో చిప్‌సెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ‘టెట్రా ప్రిజం’ టెలిఫోటో కెమెరాను అందించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఆప్టికల్ జూమ్‌ను 3x నుంచి 5xకి పెంచనున్నది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్‌లోని టెక్ విశ్లేషకుడు జెఫ్ పు.. ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుందని, ఇది తక్కువ కాంతిలోనూ మెరుగైన ఫొటోగ్రఫీకి సహాయపడుతుందని చెప్పారు.