Trump Receive Israel Presidential Medal Of Honour | ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం
గాజా ఒప్పందంలో కృషి చేసినందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ తమ అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్'ను ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. గాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్‌ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ వెల్లడించారు. త్వరలోనే సమయం వేదిక నిర్ణయించి ఈ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇచ్చిన మద్ధతు, దేశ ప్రజల శ్రేయస్సు, భద్రదత కొరకు ఆయన నెలకొల్పిన శాంతిని ఈ విధంగా గౌరవిస్తున్నామని ఇస్సాక్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషి ద్వారనే హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులు వారి ప్రియమైన వారిని చేరుకోనున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన సహాయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాలపాటు గుర్తుంచుకుంటారన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని ఇస్సాక్ హెర్జోగ్ కొనియాడారు.