Joe Biden | అమెరికా అధ్యక్షుడికి ఏమైంది.. స్టేజ్‌పై విగ్రహంలా ఫ్రీజ్‌.. పక్కకు తీసుకెళ్లిన ఒబామా..!

Joe Biden | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) వింత ప్రవర్తన కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో ఆయన మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ఇప్పుడు తన విచిత్ర ప్రవర్తనతో బైడెన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా లాస్‌ఏంజెల్స్‌లోని ఓ స్టేజ్‌పై బైడెన్‌ కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్‌ అయ్యారు. ఎలాంటి చలనం లేకుండా విగ్రహంలా నిలబడిపోయారు. ఇది గమనించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama).. బైడెన్‌ చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు.

Joe Biden | అమెరికా అధ్యక్షుడికి ఏమైంది.. స్టేజ్‌పై విగ్రహంలా ఫ్రీజ్‌.. పక్కకు తీసుకెళ్లిన ఒబామా..!

Joe Biden : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) వింత ప్రవర్తన కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా మతిమరుపు, తడబాట్లతో ఆయన మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ఇప్పుడు తన విచిత్ర ప్రవర్తనతో బైడెన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా లాస్‌ఏంజెల్స్‌లోని ఓ స్టేజ్‌పై బైడెన్‌ కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్‌ అయ్యారు. ఎలాంటి చలనం లేకుండా విగ్రహంలా నిలబడిపోయారు. ఇది గమనించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama).. బైడెన్‌ చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు.

శనివారం లాస్‌ఏంజెల్స్‌ (Los Angeles) లో జరిగిన ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పీకాక్‌ థియేటర్‌లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్‌ (Jimmy Kimmel) తో 45 నిమిషాలపాటు సరదాగా ఇంటర్వ్యూ జరిగింది. అనంతరం స్టేజ్‌పై ఉన్న బైడెన్‌, ఒబామా అక్కడున్న వారికి అభివాదం చేశారు. ఆ సమయంలో బైడెన్‌ దాదాపు 10 సెకన్లపాటు నిశ్చలంగా ఉండిపోయారు. బైడెన్‌లో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించిన బరాక్‌ ఒబామా.. ఆయన చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ దృశ్యాలు స్టేజ్‌పై ఉన్న కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

కాగా ఇప్పటికే బైడెన్‌ వింత ప్రవర్తనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గత వారం ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బైడెన్‌.. అక్కడ కూడా వింతగా ప్రవ‌ర్తించారు. ఇట‌లీ ప్రధాని జార్జియా మెలోనీని ఓ స్టేజ్‌పై క‌లిసేందుకు వెళ్లిన ఆయ‌న‌.. ఆమెను హ‌గ్ చేసుకున్న త‌ర్వాత‌.. చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. త‌ర్వాత నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు. క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్న బైడెన్‌ ఇట‌లీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉన్నది.

ఇక మ‌రో వీడియోలో బైడెన్ ఎంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారో స్పష్టమైంది. జీ7 స‌మావేశాల‌కు హాజ‌రైన నేతలంతా ఒక ద‌గ్గర ఉండ‌గా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మ‌రోవైపు వెళ్లిపోయారు. కొంతదూరం వెళ్లి అక్కడ ఎవ‌రూ లేకపోయినా థంబ్‌ సైగ చేశారు. బైడెన్ అలా ఎందుకు చేశారో అంతుబట్టకుండా ఉంది. అప్పుడు ఇట‌లీ ప్రధాని మెలానీ గమనించి బైడెన్‌ను వెనక్కు తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత అందరూ కలిసి గ్రూప్‌ ఫొటోలకు ఫోజిచ్చారు. వింత ప్రవర్తన నేపథ్యంలో జో బైడెన్ ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల విమ‌ర్శలు వ‌స్తున్నాయి.