Pakistan | పాక్ మాజీ ప్రధానిని హత్య చేశారా? అసలు నిజం ఏంటంటే?
పాకిస్తాన్ మాజీ ప్రధాన ఇమ్రాన్ ఖాను ను జైల్లో హత్య చేశారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రావల్పిండిలోని అదియాల జైలులో ఆయన మరణించారని అఫ్ఘన్ మీడియాలో వెలువడిన కథనాలు ఆధారంగా సోషల్ మీడియాలో పుకార్లు మరింత పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధాన ఇమ్రాన్ ఖాను ను జైల్లో హత్య చేశారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రావల్పిండిలోని అదియాల జైలులో ఆయన మరణించారని అఫ్ఘన్ మీడియాలో వెలువడిన కథనాలు ఆధారంగా సోషల్ మీడియాలో పుకార్లు మరింత పెరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ని వెంటనే చూపించాలని జైలు ముందు కుటుంబ సభ్యులతో పాటు పీటీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని ఆఫ్ఘనిస్తాన్ మీడియా కథనాలతో పాకిస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు అక్కాచెల్లెళ్లు రావల్పిండిలోని ఆడియాలా జైలు వద్దకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్‌ను కొలవనివ్వాలని జైలు బయట పాక్ తహ్రీక్ ఏ ఈ ఇన్సాఫ్ నేతలతో కలిసి ఆ ముగ్గురు మహిళలు డిమాండ్ చేశారు.
ఆయనను మూడు వారాలుగా కలవనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని నూరీన్ నియాజీ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ అక్క నూరీన్ నియాజీ మాట్లాడుతూ, “నా వయస్సు 71 ఏళ్లు. నా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేసి రహదారి మీదకు లాగేయడంతో గాయాలు అయ్యాయి”.. జైలు బయట ఉన్న ఇతర మహిళలను చెంపదెబ్బలు కొట్టి లాగేశారని ఆమె చెప్పారు. పోలీసుల ప్రవర్తన పూర్తిగా నేరపూరితమైనది విమర్శించారు.
కాగా, పాక్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచి ఆయన ప్రధాని అయ్యారు. తరువాత అవినీతి, హింస, ఉగ్రవాదం వంటి ఆరోపణలతో పదవి కోల్పోయారు. అనంతరం 20కి పైగా కేసులు నమోదవడంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్ కు మరణశిక్ష విధించింది. అయితే, ఇదంతా తనపై చేస్తున్న రాజకీయ కుట్ర అని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ను హత్యచేశారని అఫ్ఘాన్ మీడియా కథనాలతో పాక్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై స్పందించిన పాకిస్తాన్ ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇమ్రాన్ ఖాన్ మరణవార్తను ఖండించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram