పాకిస్తాన్‌లో పెట్రో ధరలు చూస్తే దిమ్మతిరగడం ఖాయం..

పాకిస్తాన్‌లో పెట్రోల్ రూ.458, డీజిల్ రూ.520 దాటాయి. ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చమురు ధరలే కారణం.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Apr 03, 2026, 7:53 pm IST
Read Time: 3 mins
పాకిస్తాన్‌లో పెట్రో ధరలు చూస్తే దిమ్మతిరగడం ఖాయం..

పొరుగు దేశం పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో తెలిస్తే గుండె జల్లు మనకమానదు. మన దగ్గర పెట్రోల్ ధరలు ఒకరూపాయి, రెండు రూపాయలు పెరిగితేనే…అలా ఎలా పెంచుతారంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటాం. అయితే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి చూస్తే మనం ఎంతో అదృష్ట వంతులమని అనుకోవచ్చు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నెల రోజులు తిరగకముందే పాకిస్తాన్ ప్రభుత్వం రెండోసారి ధరలను పెంచుతూ ప్రజలకు షాక్ ఇచ్చింది. తాజా పెంపుతో అక్కడ డీజిల్ ధర ఏకంగా 55 శాతం, పెట్రోల్ ధర 42 శాతం పెరిగిపోయాయి. లీటర్ డీజిల్ ధర ఇప్పుడు 520.35 పెరిగింది. ఇక పెట్రోల్ లీటర్ ధర 458.40 రూపాయలకు ఎగబాకింది. ఆ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే అక్కడ ఒక మధ్యతరగతి వ్యక్తి తన రోజువారీ సంపాదన వాటికే వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు నియంత్రణ కోల్పోవడం, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం దీనికి ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వం వాపోతుంది. ప్రస్తుతం మన భారత దేశంలో లీటర్ రూ. 100 నుంచి రూ. 110 మధ్య కొనసాగుతుండటం గమనార్హం.

ఇంధన వినియోగదారులకు ఆఫర్లు

ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం టూ వీలర్ వాడేవారికి నెలకు 20 లీటర్ల చొప్పున.. లీటరుకు. 100 సబ్సిడీ ఇస్తారట.అలాగే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ఎకరాకు రూ. 1,500 ఇస్తామని ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ వెల్లడించారు. పాక్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు పెరిగిన ధరల ముందు ఏమాత్రం సరిపోవడం లేదు. తాజాగా అమెరికాలో సైతం చమురు ధరలు పెరుగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

బ్రేకింగ్‌ పాయింట్‌కు చేరువగా భూమి.. 2070 తర్వాత 1240 కోట్లకు జనాభా సంఖ్య
రైతు భరోసా రెండో విడత.. ఈ నెల రెండోవారంలోనే!