• Telugu News
  • /Telangana

ఈ నెల రెండోవారంలోనే రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ!

ఏప్రిల్ రెండో వారంలో రైతు భరోసా రెండో విడత నిధులు జమ కానున్నాయి. 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు లబ్ధి. మొత్తం ₹9000 కోట్లతో మూడు విడతల్లో చెల్లింపులు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 03, 2026, 7:55 pm IST
Read Time: 3 mins
ఈ నెల రెండోవారంలోనే రైతు భరోసా రెండో విడత నగదు బదిలీ!

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా రెండో విడత నిధుల సమీకరణకు కసరత్తు చేస్తుంది. రెండవ విడత రైతు భరోసాకు అవసరమైన నిధులు రూ. 2650 కోట్ల రూపాయలను సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. ఇదే ఏప్రిల్ నెల రెండో వారంలో రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.

నిధుల కొరత నేపథ్యంలో యాసంగి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో చెల్లిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా మార్చి 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు రూ.3590 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి రైతులకు ఎకరం చొప్పున 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. గతంలో మాదిరిగా ఎకరాల లెక్కన కాకుండా..ఈ దఫా సరి కొత్త రీతిలో ప్రతి రైతుకు ఒక ఎకరానికి మొదటి విడత రైతు భరోసా నిధులు అందించింది.

రైతు భరోసా రెండవ విడత నిధులు రూ. 2650 ఏప్రిల్ రెండవ వారంలో రైతుల ఖాతాలలో జమ చేయనుంది. రెండవ విడతలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఖాతాలలో జమ చేయనున్నట్లుగా సమాచారం. ఏప్రిల్ నెలాఖరు వరకు మూడో విడత సహా పూర్తిస్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ. 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి :

ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ మొండి చెయ్యి : హరీశ్ రావు
బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు !