ఫిలిప్పీన్స్ లో పెను భూకంపం..సునామీ హెచ్చరికలు

ఫిలిప్పీన్స్‌ దేశ వాసులను సోమవారం తెల్లవారుజామున పెను భూకంపం కుదిపేసింది. మిండనావ్‌ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఫిలిప్పీన్స్‌ దేశ వాసులను సోమవారం తెల్లవారుజామున పెను భూకంపం కుదిపేసింది. మిండనావ్‌ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనికంటే కొన్ని గంటల ముందు భూటాన్, చైనా, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. సముద్రం లోపల భూకంపం కేంద్రం మెండనోవా దీవులకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో తీరప్రాంత నగరాల్లో ఆస్తినష్టం చోటు చేసుకొంది.

భూకంప తీవ్రత ధాటికి చాల నివాసాలు, పాఠశాలలు, వాణిజ్య భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు ఇండ్లు, ఆఫీసుల నుంచి భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పలు చోట్ల పాఠశాలల భవనాలు కూలిపోవడం, షెడ్ లు కూలిపోవడంతో పిల్లలకు గాయాలైనట్లుగా సమాచారం. ఏయిర్ పోర్టు లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. భూప్రకంపనలకు జనరల్‌ శాంటోస్‌ నగరం వణికిపోయింది. ఈ నగరంలో 7 లక్షల మంది జనాభా ఉంటారు. ఇక్కడ ట్యూనా ప్రాసెసింగ్‌ పరిశ్రమ చాలా పెద్దది. జనరల్‌ శాంటోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది.

సునామీ హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఫిలిప్పిన్స్‌ తీరంలో మూడడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. 10 అడుగుల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడొచ్చని ఫిలిప్పీన్స్‌ వాసులను హెచ్చరించారు. ఇండోనేషియా, మలేసియా, తైవాన్‌, జపాన్‌, పపువా న్యూ గునియా కూడా సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్‌ సునామీ సెంటర్‌ అంచనా వేసింది.

 

Latest News