Viral Video | బెడ్రూంలో ల‌క్షా 80 వేల తేనేటీగ‌లు.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వీటి గోల ఏందిరా బాబు..!

Viral Video | తేనేటీగ‌లు.. సాధార‌ణంగా అడ‌వుల్లో ఉంటాయి. ఇక వృక్షాలు అధికంగా ఉన్న చోట కూడా క‌నిపిస్తుంటాయి. భారీ వృక్షాలు, భ‌వ‌నాల చివ‌ర్లో తేనే తుట్టెల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ ఇంట్లో తేనేటీగ‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

  • Publish Date - July 2, 2024 / 10:41 AM IST

Viral Video | తేనేటీగ‌లు.. సాధార‌ణంగా అడ‌వుల్లో ఉంటాయి. ఇక వృక్షాలు అధికంగా ఉన్న చోట కూడా క‌నిపిస్తుంటాయి. భారీ వృక్షాలు, భ‌వ‌నాల చివ‌ర్లో తేనే తుట్టెల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఓ ఇంట్లో తేనేటీగ‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ప‌దుల సంఖ్య‌లో కాదు.. ల‌క్ష‌ల సంఖ్య‌లో తేనేటీగ‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేస‌రికి ఆ ఇంటి య‌జ‌మాని షాక్ అయ్యాడు.

ఓ ఇంటి బెడ్రూంకు పైభాగంలో సీలింగ్ వేయించారు. అయితే అందులో నుంచి ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యాల్లో ఒక‌ర‌క‌మైన శ‌బ్దం రావ‌డంతో.. ఏదో పిల్ల‌ల శ‌బ్దం అనుకునే వారు. ఇక అప్పుడ‌ప్పుడు ఆ ఇంట్లోకి తేనేటీగ‌లు రావ‌డంతో.. అవి సీలింగ్‌లో ఉండొచ్చ‌ని ఇంటి య‌జ‌మాని భావించాడు. దీంతో లోచ్ నెస్ హానీ కంపెనీ య‌జ‌మాని అండ్య్రూ కార్డ్‌కు స‌మాచారం అందించాడు.

ఇక అండ్య్రూ ఆ ఇంటికి చేరుకుని, సీలింగ్‌లోకి థ‌ర్మ‌ల్ ఇమేజింగ్ కెమెరాను పంపించాడు. దాని స‌హాయంతో ప‌రిశీలించ‌గా దాదాపు ల‌క్షా 80 వేల తేనేటీగ‌లు ఉన్న‌ట్లు నిర్ధారించారు. .దీంతో ఇంట్లోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తేనెటీగలు దాదాపు 40 వేల లీటర్ల తేనెను ఏర్పరచగలవని అండ్య్రూ తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Latest News