Thailand crane accident| రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
థాయ్ లాండ్ లో రైలుపై ఓ భారీ క్రేన్ పడిపోయిన ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
విధాత: థాయ్ లాండ్ లో రైలుపై ఓ భారీ క్రేన్ పడిపోయిన ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. బ్యాంకాక్ కు 230కిలో మీటర్ల దూరంలో సిఖియో జిల్లాలో నిర్మాణ పనులు కొనసాగుతున్న సందర్బంలో కదులుతున్న రైలుపై క్రేన్ జారీ పడింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారని సమాచారం.
ఆ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram