అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఆయన తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఆయన తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏఆర్ 15 తుపాకి కాల్పుల్లో తృటిలో తప్పించుకున్నవాళ్లను తాను చూడలేదని, అద్భుతం జరగడం వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నారని తనకు చికిత్స చేసిన వైద్యుడు చెప్పారని ట్రంప్ తెలిపారు. ఈ ఘటనలో బుల్లెట్ ఆయన చెవిని తాకడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడిన సంగతి తెలిసిందే. ‘నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో.. బహుశా చనిపోయి ఉండేవాడినేమో’ అని ఆయన చెప్పారు. జీవోపీ నేషనల్ కన్వెన్షన్‌కు హాజరయ్యేందుకు తన వ్యక్తిగత విమానంలో మిల్వాకీకి వెళ్లే క్రమంలో ఆయన న్యూయార్క్ పోస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చెవికి తెల్లని పెద్ద బ్యాండేజీతో ఆయన కనిపించారు. ఆయన ఫొటోలు తీయవద్దని ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది కోరారు.
తనపై జరిగిన హత్యాయత్నం ‘కాల్పనిక అనుభవం’గా ఆయన అభివర్ణించారు. ఇలాంటి ఘటనలో బయటపడినవారిని తన జీవితంలో చూడలేదని తనకు చికిత్స చేసిన వైద్యుడు చెప్పారని ట్రంప్ వెల్లడించారు. చట్టవ్యతిరేక వలసదారుల విషయంలో మాట్లాడే సమయంలో చార్ట్‌ను చూడటానికి సరిగ్గా అదే సమయంలో తల తిప్పి ఉండకపోతే తాను చనిపోయి ఉండేవాడినని అన్నారు. తాను తల తిప్పడంతో బుల్లెట్ తన చెవిని తాకుతూ వెళ్లిపోయిందని చెప్పారు. లేదంటే తన చెంప లేదా నుదుటి గుండా బుల్లెట్ దిగి ఉండేదన్నారు. తాను తన ప్రసంగాన్ని కొనసాగించాలనుకున్నానని, కానీ.. హాస్పిటల్‌కు వెళ్లేందుకు వెంటనే వేదిక వదిలి వెళ్లిపోవాలని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒత్తిడి చేశారని ట్రంప్ తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే ఏజెంట్లు అద్భుతంగా వ్యవహరించారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే వారు తనను చుట్టుముట్టారని పేర్కొన్నారు. ట్రంప్‌ను వేదిక నుంచి తీసుకొని వెళుతుంటే ‘ఆగండి.. నా షూస్ వేసుకోవాలి..’ అంటూ ట్రప్ చెప్పడం ఆ రోజు మైక్‌లో వినిపించింది. ఏజెంట్లు ఆయనను తీసుకుని వెళుతున్న సమయంలో ‘ఫైట్’..ఫైట్ అంటూ ట్రంప్ బిగ్గరగా నినదించారు. ‘ఏజెంట్లు నన్ను కాపాడేందుకు నామీద ఎలా పడ్డారంటే.. నా షూస్కూ ఊడిపోయాయి. నిజానికి అవి చాలా గట్టిగా ఉంటాయి’ అని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ట్రంప్ పిడికిలి బిగించి నినదిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. అనేక మంది ఐదొక చారిత్రాత్మక ఫొటోగా అభివర్ణిస్తున్నారు. ఇంతటి చారిత్రాత్మక ఫొటోను తాము చూడలేదని అనేక మంది తనతో అన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘వారు చెప్పింది నిజమే. నేను చావను. చారిత్రాత్మక ఫొటో అయితే.. చనిపోయి ఉండాలి. అదృష్టమో, దేవుడి దయో.. చాలా మంది మాత్రం దేవుడి వల్లే నేను బతికానని చాలా మంది అన్నారు. తనకు దేశధ్యక్షుడు బిడెన్ ఫోన్ చేయడంపై ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. బిడెన్ మంచి మనిషి అని ప్రశంసించారు.