AI traffic robot| అక్కడ..ట్రాఫిక్ కంట్రోల్ లో ఏఐ రోబోట్!

ఏఐ రోబోట్ లు క్రమంగా అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. చైనాలో వేగంగా విస్తరిస్తున్న ఏఐ రోబోట్ లు.. తాజాగా తాజాగా ట్రాఫిక్ విధుల్లోకి చేరిపోయాయి. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని బింజియాంగ్ జిల్లాలోని ఒక కూడలిలో "హాంగ్‌సింగ్-1" అనే AI-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ రోబోట్ తన డ్యూటీని ప్రారంభించింది.

AI traffic robot| అక్కడ..ట్రాఫిక్ కంట్రోల్ లో ఏఐ రోబోట్!

విధాత : ఏఐ రోబోట్ లు క్రమంగా అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. చైనా(China)లో వేగంగా విస్తరిస్తున్న ఏఐ రోబోట్(AI traffic robot) లు.. తాజాగా తాజాగా ట్రాఫిక్ విధుల్లోకి చేరిపోయాయి. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలోని బింజియాంగ్ జిల్లాలోని ఒక కూడలిలో “హాంగ్‌సింగ్-1” అనే AI-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ రోబోట్ తన డ్యూటీని ప్రారంభించింది. ఈ కొత్త రోబోట్ నిర్ణీత ట్రాఫిక్ కమాండ్ సంజ్ఞలను ప్రదర్శించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి హెచ్చరికలు జారీ చేస్తుంది. చైనా ఏఐ రోబోటిక్ రంగంతో ఇది సరికొత్త విప్లవంగా మారిపోయింది.

వాహనదారులు ఏఐ రోబోట్ ట్రాఫిక్ పోలీస్ అద్భుతమైన సామర్థ్యాలను త్వరగా గమనించారు. వాహనదారులను రోబోట్ నేరుగా వెళ్లి ఆపడానికి స్పష్టమైన చేతి సంకేతాలను ప్రదర్శిస్తుంది. అలాగే ట్రాఫిక్ పోలీస్ మాదిరిగానే విజిల్ ఊదుతుంది. హెల్మెట్లు లేని రైడర్లు, సిగ్నల్ లైన్‌పై ఆగే వాహనాలు, పాదచారులు జంపింగ్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది. అక్కడికక్కడే ఆడియో రిమైండర్‌లను జారీ చేస్తుంది.

దీని ఖచ్చితమైన బ్యాటరీ జీవితకాలంపై స్పష్టత లేకపోయినప్పటికి.. చైనా ప్రావిన్సులలో ఇప్పటికే వినియోగంలో ఉన్న పోలీస్ రోబోట్‌లు ఒకే ఛార్జ్‌పై 6 నుండి 8 గంటలు పనిచేస్తుండటంతో నూతన ఏఐ ట్రాఫిక్ పోలీస్ రోబోట్ కూడా కనీసం 8గంటలు పనిచేస్తుందని తెలుస్తుంది. హాంగ్‌జౌ తదుపరి తరం ట్రాఫిక్-నిర్వహణ రోబోట్‌లను కూడా రూపొందిస్తోంది. పూర్తి రోబోట్ పోలీసు టీమ్ ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది.

చైనాను భయపెడుతున్న రోబోల విస్తరణ

చైనా మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్‌డీఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజావసరాలు, ఉత్పత్తి, డిమాండ్ల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతే రోబోటిక్ రంగం కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడం మంచిది కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకే తరహా ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్‌డీఆర్‌సీ హెచ్చరిస్తోంది.