కోర్టు ధిక్కరణ.. అత్తాపూర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో అత్తాపూర్ ఆర్డీవోకు తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Apr 19, 2026, 12:21 pm IST
Read Time: 2 mins
కోర్టు ధిక్కరణ.. అత్తాపూర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష

విధాత,హైదరాబాద్ : కోర్టు ధిక్కరణ కేసులో అత్తాపూర్ ఆర్డీవోకు తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా పెద్ద షాపూర్‌లో సర్వే నంబర్ 172-183 లలో 74 ఎకరాల సీలింగ్ ల్యాండ్ భూ వివాదంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని హైకోర్టులో యూసుఫుద్దీన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు .. సూచించిన సమయానికి ఉత్తర్వులు జారీ చేయలేదని అత్తాపూర్ ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

జరిమానా చెల్లించకుంటే 2వారాలు శిక్ష పొడిగించాలని ఆదేశాలలో పేర్కొంది. అయితే అప్పిల్‌కు వీలుగా తీర్పు అమలును 2 వారాలు నిలిపివేస్తూ వెసులుబాటు కల్పించింది.