Mahima Nambiar |ఏడేళ్ల‌పాటు ఆ హీరోయిన్ నెంబ‌ర్ బ్లాక్ చేసిన హీరో.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది?

Mahima Nambiar |ఏడేళ్ల‌పాటు ఆ హీరోయిన్ నెంబ‌ర్ బ్లాక్ చేసిన హీరో.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది?

Mahima Nambiar |ఒక్కోసారి సినిమా సెల‌బ్రిటీల‌కి సంబంధించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఆ విష‌యాలు విని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చర్య‌పోతుంటారు. తాజాగా ఏడేళ్ల‌పాటు ఓ హీరోయిన్ నెంబ‌ర్ ని ఒక హీరో బ్లాక్ చేసాడ‌ట‌. ఈ విష‌యం విని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వివ‌రాల‌లోకి వెళితే మలయాళీ డైరెక్టర్ కమ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో జై గ‌ణేష్ అనే చిత్రం రూపొందింది. రంజిత్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో మ‌హిమా నంబియార్ హీరోయిన్‌గా న‌టించింది. నేడు సినిమా విడుదల అవుతుంది.ఈ క్ర‌మంలో గ‌త కొద్ది రోజులుగా చిత్ర బృందం మూవీ ప్ర‌మోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ ప్ర‌మోష‌న్స్‌లో వీరు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

మహిమా.. హీరో ఉన్ని ముకుందన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వీరిద్దరు కలిసి 2017లో మాస్టర్ పీస్ అనే సినిమా చేయగా, ఈ మూవీ త‌ర్వాత ఉన్ని ముకుంద‌న్ త‌న నెంబ‌ర్‌ని బ్లాక్ చేశాడ‌ని, ఏడేళ్ల‌పాటు తామిద్ద‌రం మాట్లాడుకోలేద‌ని చెప్పింది. జై గణేష్ మూవీలో న‌టించిన త‌ర్వాతే త‌న నెంబ‌ర్ అన్‌బ్లాక్ చేశాడ‌ని పేర్కొంది. అయితే అలా చేయ‌డానికి కార‌ణం ఏంటంటే.. “నాకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం.. మాస్టర్ పీస్ తర్వాత ఉన్నికి కూడా కుక్కపిల్లలంటే చాలా ఇష్టమని అర్ధ‌మైంది. నేను ఒక కుక్క పిల్ల గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని అనుకున్నా. అయితే నా ద‌గ్గ‌ర ఉన్ని నెంబర్ లేక‌పోవ‌డంతో రచయిత ఉదయన్‏కు కాల్ చేసి తీసుకున్నాను. అప్పుడు వాట్సాప్‌లో నేను మహిమ.. నేనెవరో మీకు తెలుసనుకుంటున్నాను. మీ నంబర్ నాకు ఉదయన్ ఇచ్చాడు అంటూ ఆయ‌న పేరుతో రెండు మూడు మెసేజ్‌లు చేశారు.

అయితే రెండో మెసేజ్ పంపే లోపే నా నెంబ‌ర్ ఉన్ని బ్లాక్ చేశాడ‌ని మహిమ చెప్పింది. అయితే అందుకు కార‌ణం ఉన్ని.. ఉదయన్ కు కాల్ చేసి చెప్పారట. ఆమెకు చాలా పొగరు..అహంకారి.. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని అలా ఎలా పిలుస్తుంది అని అడిగాడ‌ట. అయితే అప్పుడు బ్లాక్ చేసిన విష‌యం ఉన్ని మ‌రిచిపోయాడు. చాలా ఏళ్ల త‌ర్వాత మహిమ ఆర్‌డీఎక్స్ చూశాను. ఆ త‌ర్వాత రంజిత్ శంకర్ నాకు ఈ సినిమా కథ చెప్ప‌డం,. మహిమ హీరోయిన్ అని చెప్పగానే గతంలో బ్లాక్ చేసిన విషయం గుర్తుకు రావ‌డం, వెంట‌నే ఆమె నెంబ‌ర్ అన్‌బ్లాక్ చేసిన మెసేజ్ పంప‌డం జ‌రిగింద‌ని ఉన్ని తెలియ‌జేశాడు.