Prabhakar Rao| ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్ ట్యాప్ సీజ్

విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు కు చెందిన ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లను సిట్ అధికారులు సీజ్ చేశారు. మరో సెల్ ఫోన్ కూడా అప్పగించాలని సిట్ సూచించింది. సిజ్ చేసిన సెల్ ఫోన్, ల్యాప్ టాప్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి పంపించారు. వాటిలోని డేటా రికవరికి ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావును గురువారం మరోసారి విచారణకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. దుబ్బాక, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికలు సహా 2023ఆక్టోబర్ నుంచి గత ఏడాది మార్చి వరకు ప్రభాకర్ రావు కాల్ డేటాను సిట్ సేకరించింది. ప్రణిత్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్నల సెల్ ఫోన్ కాల్ డేటాల అధారంగా వారి నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ ప్రభాకర్ రావు కాల్ డేటా అధారంగా ఆయనను మరోసారి ప్రశ్నించనుంది.
ప్రభాకర్ రావు ఫోన్ కాల్ డేటా, వాట్సాస్ కాలింగ్, ఫేస్ టైమ్ సహా యాప్స్ ల ద్వారా మాట్లాడిన డేటా రిట్రీట్ కోసం సిట్ ప్రయత్నిస్తుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు మాట్లాడిన నాయకులు, అధికారులు కూడా తమ ఫోన్లలో డేటాను డిలీట్ చేసే అవకాశముందని దర్యాప్తు బృందం అనుమానిస్తుంది. 2023ఆక్టోబర్ 15నుంచి గత 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లు ఉండగా..ధ్వంసమైన ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లలో, నిందితుల ఫోన్లలో ఇంకా ఎందరి ఫోన్ నెంబర్లు..డేటా ఉన్నాయోనన్న కోణంలో సిట్ విచారిస్తుంది.