Mangoes | ముంబైకి చెందిన ఓ ఉద్యోగిని మీటింగ్‌లో సరదాగా చెప్పిన మాట విని బాస్ ఆమెకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మామిడి పండ్లు మిస్సవుతున్నానని చెప్పిన మాట గుర్తుంచుకుని.. లండన్ నుంచి మామిడి పండ్లు పంపించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబైకి చెందిన ముద్రికా కవాడియా ఇటీవల ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు మామిడి పండ్ల గురించి ప్రస్తావించింది. తమ ప్రాంతంలో ఇంకా మంచి మామిడి పండ్లు రాలేవని చెప్పింది. తాను, తన అమ్మమ్మ ఇద్దరూ మామిడి పండ్లను ఎంతగానో మిస్ అవుతున్నామని సరదాగా చెప్పింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె ఇంటికి రెండు పెద్ద మామిడి పండ్ల పెట్టెలు పార్సిల్ వచ్చాయి. అయతే అవి లండన్‌లో ఉండే తమ కంపెనీ డైరెక్టర్ పంపించాడని తెలిసి ముద్రిక ఆశ్చర్యపోయింది. వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకుంది.
మీటింగ్‌లో ఉన్నప్పుడు సరదాగా చెప్పన మాటను గుర్తుపెట్టుకుని.. లండన్‌లో ఉండి కూడా నా ఇంటికి మా డైరెక్టర్ మామిడి పండ్లు పంపించాడని ముద్రిక సోషల్‌మీడియాలో తెలిపింది. ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించింది. ఈ పోస్టుతో పాటు బాస్ పంపించిన మామిడి పండ్ల ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
మామిడి పండ్లు పంపించిన డైరెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కంపోషినేట్ లీడర్‌షిప్‌గా అభివర్ణించారు. ఇలాంటి బాస్ మాకు కూడా దొరికితే బాగుండు అని కొంతమంది సరదాగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల పట్ల ఇంత శ్రద్ధ చూపడం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు. ఏదేమైనా ఇది ఉద్యోగి నిబద్ధతను పెంచే నాయకత్వమని ప్రశంసించారు.
I casually told my Director the other day in a meeting that we’re still not getting good mangoes in our hometown and how much me and my dadi were missing them. He’s sitting in London, originally from Mumbai, and 2 days later, he had someone send two full boxes of mangoes to my… pic.twitter.com/qeIuErQJfL
— Mudrika (@MudrikaKavdia) April 11, 2026
Read More:
Viral News | ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోయిన ఉద్యోగిని..!
మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
