BRS| యూరియా కొరతపై బీఆర్ఎస్ నిరసన ప్రదర్శన
గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా” అంటూ BRS పార్టీ ఖాళీ సంచులతో యూరియా కొరతపై గన్‌పార్క్‌లో నిరసన.
విధాత, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరత(Urea Shortage) సమస్యపై బీఆర్ఎస్(BRS) పార్టీ శనివారం హైదరాబాద్ గన్ పార్కు(Gun Park) అమరవీరుల స్థూపం వద్ధ నిరసన ప్రదర్శన నిర్వహించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి టి.హరీష్ రావుల నాయకత్వంలో ఫ్లకార్డ్సు ధరించి..ఖాళీ యూరియా బస్తాల(empty urea bags protest)తో నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ .. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు వారు నినాదాలు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శలు గుప్పించారు.

రైతులకు ఖాళీ సంచులు..ఢిల్లీకి డబ్బుల సంచులు అంటూ నినాదాలతో హోరెత్తించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా వాయిదా పడగానే మరోసారి యూరియా కొరతపై నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్(Agriculture Commissioner)కి వినతిపత్రం అందించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram