Chandra Grahanam 2025| చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాలలో మూతపడిన ఆలయాలు

Chandra Grahanam 2025| చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాలలో మూతపడిన ఆలయాలు

విధాత : సంపూర్ణ చంద్రగ్రహణం(Chandra Grahanam) సందర్భంగా తెలుగు రాష్ట్రాల(Telugu states)లోని ప్రముఖ ఆలయాలు(Temples Closed) మూతపడ్డాయి. తెలంగాణ(Telangana) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కవాట బంధనం చేశారు. నిత్య కైంకర్యాలు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేశారు. భక్తులకు స్వామని దర్శనాలు నిలిపివేశారు. తిరిగి రేపు ఉదయం 3.30కు ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి,

రాహు గ్రహస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మూసివేశారు. స్వామి వారికి అన్న ప్రసాదం నివేదన చేసిన అర్చకులు అనంతరం గుడి తలుపులు మూసివేశారు. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షన, తిరుమంజనం తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతులు పునరుద్దరిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, కాళేశ్వరం ఆలయం మూసివేశారు. రేపు ఉదయం పుణ్యాహావాచనం, సంప్రోక్షన తిరుమంజనం ఆరాధాన అభిషేకాలు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం మూసివేయబడింది. రేపు తెల్లవారుజామున 3.45 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం..ఉదయం 6.30 నుంచి భక్తుల దర్శనం ప్రారంభిస్తారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం కూడా మూతపడింది. రేపు ఉదయం శుద్ధి, సంప్రోక్షన తర్వాత తిరిగి ఆలయం తెరుచుకోనుంది.

ఏపీ(Andhra Pradesh)లోనిచంద్ర గ్రహణం సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం మూసివేశారు. ప్రత్యేక సేవలు రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది. టీటీడీ పరిధిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్ప‌లాయిగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు, కపిలతీర్థం ఆలయాలను చంద్రగ్రహణంతో మూసివేశారు. సోమవారం తెల్లవారుజామన 4గంటలకు తిరిగి తెరుస్తారు.

శ్రీశైలం (Simhachalam) శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి మూసివేసి, రేపు ఉదయం 7.30 గంటలకు తెరుస్తారు. సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం మూసివేశారు. తిరిగి 8వ తేదీన ఉదయం 8 గంటల నుంచి భక్తులను సర్వ దర్శనాలకు అనుమతిస్తారు.