Chiranjeevi | ఇంట్లోనూ మెగాస్టారే.. భార్యకు వంట నేర్పించిన చిరంజీవి – ‘చిరు దోస’ కథ ఇదే!

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అంటేనే ట్యాలెంట్‌కు మరో పేరు. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్… ఇలా ప్రతి విభాగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్నారు.

  • By: sn |    latest-news |    Published on : Dec 25, 2025 4:03 PM IST
Chiranjeevi | ఇంట్లోనూ మెగాస్టారే.. భార్యకు వంట నేర్పించిన చిరంజీవి – ‘చిరు దోస’ కథ ఇదే!

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అంటేనే ట్యాలెంట్‌కు మరో పేరు. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్… ఇలా ప్రతి విభాగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా, ఇంట్లో మాత్రం ఆయన చాలా సింపుల్ అని చాలా మంది చెబుతుంటారు. తాజాగా చిరంజీవి గురించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇంట్లో గరిటపట్టి వంట చేయడంలో కూడా చిరంజీవి దిట్ట అని ఆయన స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. జయప్రద హోస్ట్‌గా నిర్వహించిన ‘జయప్రదం’ కార్యక్రమంలో ఓ యాంకర్ “మీరు అంత పెద్ద మెగాస్టార్ కదా.. ఇంట్లో ఎప్పుడైనా వంట చేస్తారా?” అని అడగ్గా, చిరంజీవి నవ్వుతూ ఆసక్తికర సమాధానం చెప్పారు.

భార్య సురేఖకు వంట నేర్పిందే చిరంజీవి!

“నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అసలు నా భార్య సురేఖకు వంట నేర్పిందే నేనే. ఆమెకు ఉప్మా చేయడం కూడా రాదు. కాఫీ పెట్టడం ఎలా అనేది కూడా నేనే చెప్పాను. అలా పంపించారు అల్లు వాళ్లు నా ఇంటికి” అంటూ సరదాగా అల్లు కుటుంబంపై సెటైర్లు వేశారు చిరంజీవి. ఈ మాటలు అప్పట్లో ప్రేక్షకులను బాగా నవ్వించాయి.

చిరంజీవి అన్ని రకాల వంటలు చేయగలిగినా, ఆయన పేరుతో ప్రత్యేక గుర్తింపు పొందిన వంట మాత్రం ‘చిరు దోస’. ముఖ్యంగా స్టీమ్ దోసెలు చిరంజీవి ఇంట్లో చాలా ఫేమస్. నూనె లేకుండా ఆవిరితో ఉడికించే ఈ మెత్తటి దోసెలు హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌గా చిరంజీవి ఎక్కువగా తింటారట. అందుకే ఇండస్ట్రీలో ఇవి ‘చిరు దోసలు’గా పాపులర్ అయ్యాయి. రవ్వ, బియ్యం పిండి, పెరుగు, కూరగాయలతో చేసే ఈ దోసెలు నోట్లో కరిగిపోయేంత మెత్తగా ఉంటాయట. అల్లు అరవింద్ ద్వారా ఈ దోసెలు పలువురు సెలబ్రిటీలకు కూడా పరిచయం అయ్యాయని సమాచారం. రజనీకాంత్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులకు కూడా చిరు దోసలు అంటే ఇష్టమని టాక్.

సీ ఫుడ్ అంటే ప్రాణం

మెగాస్టార్ చిరంజీవి మంచి ఫుడీ కూడా. ముఖ్యంగా సీ ఫుడ్ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. తల్లి అంజనాదేవి చేతి వంట అయితే మరీ ప్రత్యేకం. ఆమె చేసే చేపల పులుసు, ఎండు చేపల కూర అంటే లొట్టలేసుకుని తింటారట. కరోనా సమయంలో చిరంజీవి తల్లి కోసం ఎండు చేపల ఫ్రై చేసి పెట్టిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

70 ఏళ్లైనా అదే హుషారు

ఇటీవలే 70 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినా చిరంజీవిలో ఏమాత్రం తగ్గుదల కనిపించడంలేదు. డ్యాన్స్‌లో ఇప్పటికీ అదే గ్రేస్, అదే ఎనర్జీతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాదు గారు’ సినిమా నుంచి వచ్చిన పాటల్లో చిరంజీవి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉండగా, తర్వాత ‘విశ్వంభర’ తో పాటు డైరెక్టర్ బాబీతో మరో సినిమా కూడా లైన్లో ఉంది.