Revanth Reddy| ఎస్సారెస్పీ 2కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి పేరును పెడుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్డీఆర్ ఎస్సారెస్పీ 2గా పేరు మారుస్తూ 24 గంటల్లో జీవో ఇస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు

విధాత : ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు(SRSP Phase 2 Canal) మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి( R. Damodar Reddy) పేరును పెడుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. ఆర్డీఆర్ ఎస్సారెస్పీ 2గా పేరు మారుస్తూ 24 గంటల్లో జీవో ఇస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం తుంగతుర్తిలో జరిగిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభలో ఆయన ఆర్ఢీఆర్ కు నివాళులు అర్పించి మాట్లాడారు. 40ఏళ్ల క్రితమే సాగు నీటికోసం పోరాడిన నాయకుడని, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు సాగుతాగునీటి కోసం, అభివృద్ధి కోసం తన జీవిత కాలం పోరాడారు అని గుర్తు చేశారు.
ప్రజల కోసం.. నమ్మిన కార్యకర్తల కోసం ఆస్తులు నమ్ముకుని పని చేసిన నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి కే.జానారెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.