Diwali Astrology News| ఈ దీపావళి ఆ రాశుల వారికి వెరీ స్పెషల్..500 ఏళ్ల తర్వాత వైభవ లక్ష్మీ రాజయోగం
ఈ ఏడాది దీపావళీ కొన్ని రాశులకు వెరి స్పెషల్ గా గుర్తుండిపోనుంది. ఈ దఫా దీపావళికి 500 సంవత్సరాల తర్వాత అరుదైన, శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుందని దీంతో కొన్ని రాశుల వారికి అంతా శుభప్రదం కానుందని జ్యోతిష్య శాస్త్ర పండితుల కథనం.
విధాత : ఈ ఏడాది దీపావళీ(Diwali) కొన్ని రాశుల(Lucky zodiac signs)కు వెరి స్పెషల్ గా గుర్తుండిపోనుంది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటున్నారు. అయితే ఈ దఫా దీపావళికి 500 సంవత్సరాల తర్వాత అరుదైన, శక్తివంతమైన(500 years rare yogam) వైభవ లక్ష్మీ రాజయోగం (Vaibhava Lakshmi Raja Yogam)ఏర్పడుతుందని జ్యోతిష‌్య శాస్త్ర పండితుల(Astrology predictions) కథనం. చంద్రుడు, శుక్రుడి సంయోగం కారణంగా ఈ యోగం ఏర్పడబోతుందట. చంద్రుడు (శ్రేయస్సుకు కారకం), శుక్రుడు (లక్ష్మీ చిహ్నం) కన్యారాశిలో సంయోగం కారణంగా దీపావళి చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉండనుందని పండితులు చెబుతున్నారు. ఈ వైభవ లక్ష్మీ రాజ యోగంతో సంపద, జీవితంలో పురోగతి, ఊహించని లాభాలు, విదేశీ ప్రయాణం చేసే అవకాశాలను కొన్ని రాశుల వారు అందుకోబోతున్నారని పండితులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కన్యారాశి, మకరం, కుంభ రాశుల వారికి మహా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.
ఈ రాశుల వారికి అంతా శుభప్రదమే
కన్యారాశి వారికి వైభవ లక్ష్మీ రాజ యోగం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉండనుందంటున్నారు. ఈ రాశి వారిలో రాజయోగం వారి లగ్నరాశిలో ఏర్పడబోతుంది. అది వారి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ సమయంలో వారి సామర్థ్యాలు వృద్ది చెంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. చేసే వృత్తులలో కొత్తగా నాయకత్వ అవకాశాలు లభిస్తాయి. కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. విదేశీ పని.. లేకపోతే ప్రయాణ అవకాశాలుంటాయి. కుటుంబం, వైవాహిక జీవితం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావడంతో పాటు జీవితంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అన్నింటా విజయవకాశాలు..సత్ఫలితాలు అందుకుంటారు.
మకర రాశి వారికి వైభవ లక్ష్మీ రాజ యోగ ప్రభావంతో మంచి రోజులు వస్తాయి. ఈ రాజయోగం వారి సంచార జాతకంలోని అదృష్ట ఇంట్లో ఏర్పడుతుండటంతో ఇది ప్రత్యేక అదృష్టాన్ని తీసుకువస్తుంది. రాజ్యయోగంతో అదృష్టం బలం పెరిగి…పెండింగ్ పనులు పూర్తవ్వడంతో పాటు కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారం, వృత్తులలో విజయాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. లాభదాయకమైన ఒప్పందాలను చేసుకోవడంతో పాటు దేశ, విదేశాల ప్రయాణవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల విద్యార్థులకు రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ రాశి వారు పొందుతారు.
కుంభ రాశి వారికి వైభవ లక్ష్మీ రాజ యోగం ఆర్థికంగా లాభదాయకమైంది. ఈ రాశి వారికి రాజ యోగం ఆదాయానికి సంబంధించిన ఇంట్లో ఏర్పడుతుండటంతో వారి ఆదాయం వృద్ది చెందుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు జరిగి వ్యాపారం అభివృద్ధి సాధిస్తుంది. భవిష్యత్తులో గణనీయమైన లాభాలను ఈ రాశివారికి తీసుకువస్తుంది. స్టాక్ మార్కెట్, ఇతర ఆర్థిక రంగాల్లో పెట్టుబడులు కూడా మంచి లాభాలను అందించే అవకాశం ఉంది. లాటరీలు, అనిశ్చిత వనరుల నుంచి కూడా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా, వివేకంతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలతో పాటు కుటుంబానికి ఆనందాన్నిరాజయోగం అందిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram