Maoists | మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి.. ఆయుధాలు ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా?

దేశంలో మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో అనేక ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి? ఆయుధాలు ఎలా సమకూర్చుకుంటారు? వాళ్ల ఆస్తులు, నిధులు ఎక్కడ.. ఎవరి ఆధినంలో ఉంటాయి? లాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Maoists | మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి.. ఆయుధాలు ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా?

విధాత, హైదరాబాద్ :

జనం కోసం వనంలోకి వెళ్లి.. ప్రజల కోసం అన్యాయంపై పోరాడుతున్నాం అని చెప్పుకునే మావోయిస్టులు.. గత కొన్ని నెలలుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మావోయిస్టు పార్టీ సాధారణ దళ సభ్యుడి నుంచి పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న నేతల వరకు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. వాళ్లు లొంగిపోవడమే కాకుండా తమ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా అప్పగిస్తున్నారు. కాగా, మావోయిస్టులు జనంలోకి రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగార్ అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ నెట్ వర్క్ ను పూర్తిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మావోయిస్టులను తొలగించడానికి 2024 చివర్లో ప్రారంభమైన ఈ అటవీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఇది ఒకింత విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించడంతో పాటు.. పార్టీలోని ముఖ్యనేతలతో సహా వందలాది మంది వనం వీడి జనంలో కలిసిపోయారు.. కలిసిపోతూనే ఉన్నారు. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మావోయిస్టుల వద్ద 400 కిలోల బంగారం ఉన్నట్లు వార్త కథనాలు వెలుడడంతో  ఆ వార్త తెగ హల్చల్ అవుతోంది. దీంతో దేశంలో మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో అనేక ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.  ముఖ్యంగా మావోయిస్టులకు నిధులు ఎలా వస్తాయి? ఆయుధాలు ఎలా సమకూర్చుకుంటారు? వాళ్ల ఆస్తులు, నిధులు ఎక్కడ.. ఎవరి ఆధినంలో ఉంటాయి? లాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే, మావోయిస్టు పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అని అందరు తెలుసుకోవాలి. కాకపోతే అది నిషేధించిన పార్టీ అంతే. ఆ పార్టీకి కూడా సాధారణంగా ఇతర రాజకీయ పార్టీలకు ఉన్నట్లే ఖర్చులు ఉంటాయి. పార్టీ దళ సభ్యుల ఆహారం, బట్టలు, వైద్యం మరీ ముఖ్యంగా వాళ్లు వినియోగించే ఆయుధాలు కొనుగోలు చేయాలంటే సాధారణంగా కాకుండా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోలు వాళ్లకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి అనేక దారులు వెతుక్కునక్నారు. అందులో దోపిడీలు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు, వ్యాపారవేత్తల నుంచి ఫండ్స్ వసూలు చేస్తారు. వీటితో పాటు మావోయిస్టులు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతారని సమచారం. అలాగే, తమ సానుభూతి పరులు, కుటుంబ సభ్యుల పేర్ల మీద డొల్ల కంపెనీలు(షెల్ కంపెనీలు) ఏర్పాటు చేసి నిధులు సమకూర్చుకుంటారని పోలీసుల కథనం.

దీనికి గాను మావోయిస్టుల వద్ద పెద్ద మొత్తంలో నెట్ వర్క్ ఉన్నట్లు జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) చేపట్టిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా అనేక రూపాల్లో వచ్చిన డబ్బులతో మావోయిస్టులు తమ కార్యాకలాపాలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఆయుధాల కొనుగోలు చేయడం వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. ఎందుకంటే అవి ఇల్లీగల్ గా కొంటారు కాబట్టి. మారణాయుధాలు కొనడానికి మావోయిస్టులు.. ఆయుధాలు తయారు చేసే ప్రైవేటు కంపెనీలతో డీలింగ్ పెట్టుకుని వాటికి భారీ ఎత్తున నగదు చెల్లించి వెపన్స్ కొనుగోలు చేస్తారని తెలుస్తోంది.