విధాత, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత కు బిగ్ షాక్ ఇచ్చింది. కవిత కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరు కేటాయింపుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో..ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ కవితకు లేఖ రాసింది. పార్టీ పేరు మార్చాల్సిందేనని, 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే పార్టీ దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది.
అయితే ఎన్నికల సంఘం లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపింది. కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే తమకు పంపినట్లు వెల్లడించింది. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది.
కవిత ప్రతిపాదించిన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన పేరుకు క్లుప్త నామం టీఆర్ఎస్ అని వస్తుందని, ఇదే పేరుతో గతంలో ఉన్న పార్టీల చరిత్ర, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరును అనుమతించలేమని సీఈసీ లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఇదే టీఆర్ఎస్ పేరుతో గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయని, కొత్తగా మరో టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు కల్పిస్తే ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉండటం..ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తుల ఫిర్యాదులు అందడంతో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవరోధాలు నెలకొన్నాయి. దీంతో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ కవితకు సూచించింది.
