Wildlife Tragedy| పాపం ఏనుగు పిల్ల.. చెరువులో పడి మృతి
ఓ గున్న ఏనుగు చెరువు నీటిలో పడి మృతి చెందింది. పార్వతీపురం మన్యం జిల్లా లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమరావతి : ఏనుగుల గుంపు వెంట తిరుగుతున్న ఓ గున్న ఏనుగు(Elephant Calf) చెరువు నీటిలో పడి మృతి చెందింది. పార్వతీపురం మన్యం(Parvathipuram Manyam) జిల్లా లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన్యం జిల్లాలోనే తిష్ట వేసిన ఒక ఏనుగుల గుంపులోని రాజు అనే ఏనుగు పిల్ల (7 నెలలు) ప్రమాదవశాత్తు గ్రామ చెరువులో పడి మృతి చెందింది. ఈ గుంపులోని ఏనుగులలో గున్న ఏనుగుతో కలిపి ఇప్పటి వరకు ఎనిమిది ఏనుగులు పలురకాలుగా చనిపోయాయి.
ఏనుగు పిల్ల మృతి చెందడంతో.. మిగిలిన ఏనుగులు ఘీంకారాలతో ఘోషిస్తున్నాయి. చనిపోయిన ఏనుగు పిల్ల మృతదేహాన్నిఅటవీ శాఖ సిబ్బంది,స్థానికులు చెరువు నుంచి బయటకు తెచ్చారు. ఏనుగు పిల్ల మరణంతో గుంపు ఏనుగులు రెచ్చిపోయే ప్రమాదం ఉండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.