farmer money credited to temple| రైతు పత్తి డబ్బులు..రాజన్న ఆలయం ఖాతాలో..!
ప్రతికూల వాతావారణ పరిస్థితులు..ఎన్నో వ్యయ ప్రయాసలతో పండించిన పత్తిని అమ్మి డబ్బుల కోసం ఎదరుచూసిన ఓ రైతుకు అధికారుల నిర్వాకం మరిన్ని కష్టాల పాలు చేసింది. పత్తి అమ్మిన డబ్బులు రైతు ఖాతాకి బదులుగా..వేముల వాడ రాజన్న ఆలయం అకౌంట్ లో జమ చేసిన వైనం వైరల్ గా మారింది.
విధాత : ప్రతికూల వాతావారణ పరిస్థితులు..ఎన్నో వ్యయ ప్రయాసలతో పండించిన పత్తిని అమ్మి డబ్బుల కోసం ఎదరుచూసిన ఓ రైతు(cotton farmer)కు అధికారుల నిర్వాకం(officials negligence) మరిన్ని కష్టాల పాలు చేసింది. పత్తి అమ్మిన డబ్బులు రైతు ఖాతాకి బదులుగా..వేముల వాడ రాజన్న ఆలయం అకౌంట్ లో జమ(farmer money credited to temple) చేసిన వైనం వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. వేములవాడకి చెందిన ఏదుల సత్తమ్మ అనే రైతు నాంపల్లి సీసీఐలో పత్తి అమ్మగా… రూ. 2 లక్షల 14వేల 549 డబ్బులు తన ఖాతాలో అధికారులు వేయాల్సి ఉంది. 11వ తేదీన డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చింది. తన ఖాతాలో పత్తి డబ్బులు పడలేదంటూ బాధిత రైతు సత్తమ్మ అధికారులను సంప్రదించింది. అయితే అధికారులు పొరపాటును ఏదుల సత్తమ్మ ఖాతాలో కాకుండా వేములవాడ రాజన్న అలయ అకౌంటులో జమ చేశారు.
అయితే అధికారుల తప్పిదం వల్ల సత్తమ్మ అధార్ నంబర్ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాకి అనుసంధానం కావడంతో ఆమెకు సంబంధించిన రూ.2లక్షల 14వేల 549 రాజన్న ఆలయ ఖాతాలో పడిపోయాయి. అధికారులు చేసిన పొరపాటును సరిదిద్ది తనకు న్యాయంగా రావాల్సిన పత్తి డబ్బులను తన ఖాతాలో జమ చేయించాలని రైతు సత్తమ్మ అధికారుల చుట్టూ తిరుగుతుంది. కొడుకుతో కలిసి సీసీఐ అధికారులను, మార్కెట్ సెక్రటరీని, బ్యాంకు మేనేజర్ ను, దేవస్థానం ఈవోను కలిసింది. ఇంతమందిని కలిసిన రైతు సత్తమ్మ డబ్బులు మాత్రం 20 రోజులు గడుస్తున్నప్పటికి తన ఖాతాలో జమ అవడం లేదని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అధికారులు తప్పిదానికి ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట డబ్బులకు కూడా మరిన్న కష్టాలు పడాల్సి వస్తుందంటూ రైతు సత్తమ్మ వాపోతుంది. పత్తి సాగుకు తెచ్చిన విత్తనాలకు, పురుగు మందులకు, కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని..వారందరితో మాటలు పడాల్సి వస్తుందని సత్తమ్మ మీడియాకు తన గోడు వినిపించింది. దేవస్థానం డబ్బులు రైతు ఖాతాల పడితే ఇప్పటికే ఆగమేఘాల మీద అకౌంట్ ఫ్రీజ్ చేసి మరి వెనక్కి తీసుకునే వారని..రైతు డబ్బులు కావడంతోనే అధికారులు ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సత్తమ్మ ఆరోపించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram