Iftar Flexi Controversy | హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం

హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. బంజారాహిల్స్‌లోని తన విరించి హాస్పిటల్ వద్ద ఎంఐఎం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించిపారేశారు. రంజాన్ వేళ ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

Iftar Flexi Controversy | హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. బంజారాహిల్స్‌లోని తన విరించి హాస్పిటల్ వద్ద ఎంఐఎం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించిపారేశారు.  రంజాన్ వేళ ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.  రంజాన్ ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో ఫంక్షన్ హాల్‌లో లక్షలు వెచ్చించి ధనవంతులకు ఇచ్చేది కాదు అని, రంజాన్ అంతరార్థాన్ని ఎంఐఎం విస్మరించింది అని మండిపడ్డారు.

ఇఫ్తార్ విందులు అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు, నిజమైన పేదలకు ఇవ్వాలని సూచించారు. పబ్లిసిటీ కోసం, ప్రదర్శన కోసం చేసే ఇఫ్తార్ విందులు రంజాన్ స్ఫూర్తికి విరుద్ధం అని స్పష్టం చేశారు. రంజాన్ ఇఫ్తార్ అంటే ఏమిటో, విశిష్టత ఏమిటో ఎంఐఎం నేతలు తెలుసుకోవాలని మాధవీలత హితవు పలికారు.

 

ఇవి కూడా చదవండి :

Sunrisers Leeds X account suspended| సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావ్య పాపకు ఎక్స్ షాక్ !
Hyderabad iftar flexi controversy| హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం