కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
కర్ణాటకలోని ప్రముఖ ప్రకృతి పర్యాటక కేంద్రం బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలోకి నాలుగు కొత్త చిరుతలు వదిలారు. ఒకప్పుడు కర్ణాటక అడవుల్లో శివాంగిగా పిలిచే ఈ చితాలు ఉండేవని, ఇప్పుడు వాటి సంతతి అంతరించిపోయిందని, ఈ నేపథ్యంలో మళ్లీ వాటి సంతతి అభివృద్ది చేసేందుకు దక్షిణాఫ్రికా నుంచి వాటిని తెప్పించారు.
విధాత : భారత్ లో అంతరించిపోయిన చీతా చిరుత పులుల జాతీ పునరుద్దరణకు కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు చీతా వేగంగా సత్ఫలితాలనిస్తూ పురోగమిస్తుంది. సుమారు 70 ఏళ్ల క్రితం భారతదేశంలో అంతరించిపోయిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు ‘చీతా’ను తిరిగి ప్రవేశపెట్టడంలో భారత ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుంది.
కర్ణాటక బన్నేరుఘట్ట పార్కులోకి నాలుగు చీతాలు
కర్ణాటకలోని ప్రముఖ ప్రకృతి పర్యాటక కేంద్రం బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలోకి నాలుగు కొత్త చిరుతలు వదిలారు. దక్షిణాఫ్రికా నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి..అక్కడి నుంచి బన్నేరు ఘట్ట నేషనల్ పార్కుకు క్వారంటైన్ కేంద్రానికి తరలిచించారు క్వారంటైన్ పూర్తయిన తర్వాత వాటిని అభయారణ్యంలోకి వదులుతారు. ఒకప్పుడు కర్ణాటక అడవుల్లో శివాంగిగా పిలిచే ఈ చితాలు ఉండేవని, ఇప్పుడు వాటి సంతతి అంతరించిపోయిందని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్లీ వాటి సంతతి అభివృద్ది చేసేందుకు దక్షిణాఫ్రికా నుంచి తెప్పించామన్నారు.
వేగంగా పురోగమిస్తున్న చీతాల సంఖ్య
ఇప్పటికే దేశంలోకి దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్వాన్సా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చిరుతలతో పాటు వాటికి జన్మించిన కూనలతో కలిపి భారత్ లో వాటి సంతతి 48కి చేరింది. గడిచిన రెండేళ్లలో కునో నేషనల్ పార్క్ చీతాల సంతానోత్పత్తికి అనువైన కేంద్రంగా మారింది. 2023 నుండి ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 39 పిల్లలు జన్మించగా, అందులో 27 సురక్షితంగా ఉన్నాయి. గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మరికొన్ని చీతాలను సంరక్షిస్తున్నారు.
VIDEO | Four cheetahs arrive at Bannerghatta Biological Park (BBP) in Bengaluru from South Africa.
Karnataka Minister Eshwar Khandre welcomed them at Kempegowda International Airport at midnight.
(Source: Third Party)
(Full video available on PTI Videos -… pic.twitter.com/9qJ9KCpaEy
— Press Trust of India (@PTI_News) April 18, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram