Indigo flight cancellations| ఇండిగో నిర్వాకం..ఆరో రోజు విమానాల రద్దు
ఇండిగో విమానాల రద్దు సంక్షోభం కొనసాగుతుంది. ఆరో రోజు కూడా ఇండిగో సంస్థ విమానాల సర్వీస్ ల పునరుద్దరణలో విఫలమవ్వడంతో వందల విమాన సర్వీస్ లు రద్దు చేశారు.
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు(Indigo flight cancellations) సంక్షోభం కొనసాగుతుంది. ఆరో రోజు కూడా ఇండిగో సంస్థ విమానాల సర్వీస్ ల పునరుద్దరణలో విఫలమవ్వడంతో వందల విమాన సర్వీస్ లు రద్దు చేశారు. శంషాబాద్ కి రావాల్సిన 54 విమానాలు రద్దు చేశారు. అలాగే వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 61 ఇండిగో విమానాలతో పాటు హైదరాబాద్ లో మొత్తం 115 విమానాలు రద్దు అయ్యాయి.
బెంగళూరు విమానాశ్రయం నుంచి150, శంషాబాద్ నుంచి115, చెన్నైలో 38, విశాఖలో 10 సర్వీసులను రద్దు చేశారు. పూర్తి స్థాయిలో సర్వీస్ లను పునరుద్ధరిస్తామన్న ఇండిగో సంస్థ మాటలు అమలు కాలేదు. దీంతో విమాన సర్వీస్ ల పునరుద్దరణ జరుగక ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికల లగెజీలు ఎప్పుడు వస్తాయో తెలియక గందరగోళం నెలకొంది.
ఇండిగో తీరుపైన, కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు.
ఇండిగో విమాన సర్వీస్ ల రద్దు నేపథ్యంలో ఇతర విమానయాన సంస్థలు టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులను దోచుకుంటుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం టికెట్ల ధరల నియంత్రణకు ఇచ్చిన ఆదేశాలను ఎయిర్ లైన్స్ సంస్థలు లెక్క చేయలేదు. విశాఖ నుంచి హైదరాబాద్ కు 30వేల నుంచి 35000, హైదరాబాద్ నుంచి కోల్ కత్తాకు 73వేల వరకు టికెట్ల ధరలు పెంచి వసూలు చేసుకున్నారు.
టికెట్ ధరల దోపిడిపై, సమస్యలకు కారణమైన ఇండిగో సంస్థపైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.ఇండిగో టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామన్న ప్రకటించినా..ఇతర విమానాల్లో ప్రయాణానికి పదింతలు అధికంగా చెల్లించామని…అంతమేరకు ఆ సంస్థ తమకు చెల్లించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram