కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరు టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా కవిత వెల్లడించారు
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరు టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా కవిత వెల్లడించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో తెలంగాణ రాష్ట్ర సేన జెండాను ఆవిష్కరించారు. జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరును పొందుపరిచారు. జెంగా కింది వరుసలోని ఆకుపచ్చ రంగు పట్టి దాని మధ్యలో తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన పేరు ఉండేలా జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిపించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిపోవడంతో ఇప్పుడు ఆ పేరును కవిత సొంతం చేసుకోవడం ద్వారా రాజకీయంగా తన తండ్రి, అన్న కేసీఆర్, కేటీఆర్ లకు చెందిన బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్లయ్యింది. పార్టీ ఆవిర్బావ వేదిక నుంచి తండ్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పటి కేసీఆర్ మన మనిషి కాదు..మర మనిషి : కవిత
కొత్త పార్టీ ప్రకటన సందర్బంగా కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజలకు కష్టం వస్తే వాలిపోయేవాడని, ఇప్పటి కేసీఆర్ ఎక్కడ ఉన్నారని కవిత విమర్శించారు. చిన్న సారు కేటీఆర్ ను సీఎం చేయడమే బీఆర్ఎస్ ఎజెండా అని, రాహుల్ ను ప్రధాని చేయడం కాంగ్రెస్ ఎజెండా, సామాజిక న్యాయాన్ని అంతం చేయడమే బీజేపీ ఎజెండా అని, మూడు పార్టీలపై పాంఛజన్యం పూరిస్తున్నాం అని కవిత ప్రకటించారు అధర్మవైపు మనవాడు నిలబడ్డా యుద్ధం చేస్తాం అని స్పష్టం చేశారు.
కొన్ని విషయాలను సిగ్గుపడుతున్నానని ప్రజలు క్షమించాలని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సరిగా పాలించలేదు అని, ఆనాటి కేసీఆర్ వేరు.. ఈనాటి కేసిఆర్ వేరు కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి అని కవిత విమర్శించారు ఆనాటి కేసిఆర్ ప్రజలకు కష్టం వచ్చిన వాలిపోయేవారు ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న బయటికి రావడం లేదు అన్నారు. గుంట నక్కలు తొడేళ్ల చేతుల్లో ఖైదీగా మారారు అని, రాష్ట్రానికి ఏం చేశారని దేశానికి బయలుదేరారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కర్కోటకుడి పాలన నడుస్తుందని, ప్రజలు గోసపడుతుంటే మన కేసీఆర్ ఎక్కడున్నారు అని నిలదీశారు. నన్ను గెంటేసిన వెంటనే పార్టీ పెట్టలేదు.. మారుతారేమో అని వేచి చూశానని, పార్టీ నుంచి బయటకు రావడం నాకు మంచిదే అయింది అన్నారు.
ఆనాడు తెలంగాణను పదేళ్లు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు బాధపడుతున్నానని, తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయింది, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అని, ఉద్యమంలో మనల్ని తిట్టిన వాళ్ళు పదవుల్లో ఉన్నారని కవిత ఆరోపించారు. పదేళ్లలో 30 వేల మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు అని, ఎంతమంది ఉద్యమకారులకు అవకాశాలు వచ్చాయో ఆలోచించాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి గురించి చెబితే నన్ను గెంటేశారు అని, అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారని, బీఆర్ఎస్ తప్పులు చాలా ఉన్నాయి అన్నారు. ఇప్పుడున్న సీఎం కర్కోటకుడు, హిట్లర్ లాంటివాడు అని, ఇప్పటి పార్టీలు అవినీతి, బందుప్రీతిలో నిండిపోయాయి అని, ఐదు అంశాల కోసం నేను కొట్లాడుతానన్నారు.
బీజేపీపై విమర్శలు
అసలు బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదు అని,తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారు అని కవిత విమర్శించారు. మెడ మీద తల లేని ఓ బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చారు అని, బీజేపీ బానిస ఎంపీలు కనీసం మాట్లాడలేదు అని, బీజేపీపి ఎంపీలకు చేతనైతే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలని కవిత డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయి అన్నారు. బీజేపీ మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరని, సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ అని, మహిళ బిల్లు పక్కన పెట్టారు. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారు అని ఆరోపించారు.
పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారు అని, ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన ఏడు మండలాలు తీసుకున్నారు అని, అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరని విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
RTC Strike | 12 గంటల చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
Kalvakuntla Kavitha | ఏప్రిల్ 25 శక్తివంతమైనదే.. కానీ కవితకు కొంత సవాలే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram