నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
త్వరలో నేను ప్రకటించబోయే పార్టీలోకి బీఆర్ఎస్ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాల నుంచి భారీ చేరికలు ఉండబోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత సమక్షంలో జాగృతిలో చేరారు.
విధాత, హైదరాబాద్ :త్వరలో నేను ప్రకటించబోయే పార్టీలోకి బీఆర్ఎస్ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాల నుంచి భారీ చేరికలు ఉండబోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత సమక్షంలో జాగృతిలో చేరారు.
రాథోడ్ బాపూరావును కండువా కప్పి కవిత జాగృతిలోకి ఆహ్వానించారు. ఇదే వేదిక మీద సిరిసిల్ల నియోజకవర్గం నుంచి జాగృతిలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారు అని, జాగృతి ద్వారానే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ చేరారని, రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అని గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న ఉద్యమ కారులు మా కొత్త పార్టీ వైపు చూస్తున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుంది అన్నారు. ఉద్యమకారులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని, ఏ స్పిరిట్ తో తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పని అదే రీతిలో ఏకంగా కావాలన్నారు. బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరుతున్నానని తెలిపారు.
రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులు వస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బోథ్ నియోజకవర్గంలో పని చేశానన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని, కవిత ఇచ్చిన ధైర్యంతో ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో చేరి, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు అని, మూడవ సారి నాకు టిక్కెట్ ఇవ్వలేదు అని ఆవేదన వెలిబుచ్చారు. అందుకే బీఆర్ఎస్ ను వదిలి కవితనాయకత్వంలో కొత్త పార్టీలో చేరినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి కవిత కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా నాకు ప్రాధాన్యత దక్కలేదు అని, కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో పెద్ద సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో జాయిన్ చేయిస్తానని బాపూరావు రాథోడ్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram