KAVITHA|కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై కవిత హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు కేసు(Formula-E Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) విచారణకు గవర్నర్ అనుమతించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత(kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులు చేయడం పనిగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెసోళ్లకు సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలకు ముఖం చూపెట్టుకోలేక ప్రతిపక్ష నాయకులకుపై కేసులు పెట్టడం పనిగా పెట్టుకున్నారని కవిత విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నాయని, ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారన్నారు. చట్టం, కోర్టులు ఉన్నాయని..కేసుల్లో ఏం తేలుతుందో వేచి చూడాలన్నారు. దేశంలో కక్ష పూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి తెలంగాణలో పెడుతున్న అక్రమ కేసులే నిదర్శనం అన్నారు. ఇందుకు ఉదాహారణగా రాష్ట్రంలో నేను నంబర్ వన్, మిగతా వాళ్లు వరుసగా ఉంటున్నారని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram