విధాత : మహిళల ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో బ్రెజిల్ ఉమెన్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ లారా కార్డోసో
సరికొత్త సృష్టించింది. మహిళల, పురుషుల క్రికెట్ లో ఇప్పటివరకు ఎవరికీ సాధించని రీతిలో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కలహరి విమెన్స్ టీ20 టోర్నీలో భాగంగా గురువారం లెసోతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కార్డోసో ఈ అరుదైన రికార్డు(9/4) సాధించింది. కేవలం మూడు ఓవర్లు వేసిన కార్డోసో 4 రన్స్ ఇచ్చి హ్యాట్రిక్‌తో సహా 9 వికెట్లు తీసింది. మూడు ఓవర్లే వేసిన కార్డ్ సో.. తన తొలి ఓవర్లో హ్యాట్రిక్ చేసింది. రెండో ఓవర్లో నాలుగు వికెట్లు, మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో సోనమ్ యషె (భూటాన్, 8/7, మయన్మార్‌పై 2025లో) పేరిట ఉన్న ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొట్టింది. 2024లో ఇండోనేసియా బౌలర్ రోహ్మాలియా నెలకొల్పిన 7/0 రికార్డు కూడా ఈ మ్యాచ్‌లో కార్డోసో తుడిచిపెట్టేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బ్రెజిల్ 20 ఓవర్లలో 202 రన్స్ చేసింది.
మోనికే మచాడో (69 నాటౌట్), రాబర్టా అవేరీ (48) రాణించారు. తర్వాత 202 పరుగుల ఛేదనలో లెసోతో జట్టు కార్డ్ సో విజృంభణతో కేవలం 6.2 ఓవర్లలో 13 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బ్రెజిల్ 189 రన్స్ భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. టార్గెట్ చేధనలో లెసోతో జట్టును కార్డోసో తన బౌలింగ్‌తో వణికించింది. రెండో ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఆమె నాలుగో ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసింది. ఆరో ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చివరి వికెట్ మరియానే ఆర్తుర్ ఖాతాలోకి వెళ్లింది.
