Manchu Manoj: మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. మనోజ్ కొద్ది రోజు క్రితం తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చి పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా నాగిరెడ్డి-శోభ దంపతుల రెండో కుమార్తె మౌనికరెడ్డిని గతేడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరి పెళ్లి మంచు లక్ష్మీ చేతుల మీదుగా ఘనంగా జరిపించింది. అయితే కొద్ది రోజుల క్రితం మనోజ్ తన భార్య భూమా మౌనిక ప్రగ్నెంట్ అని చెప్పాడు. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తండ్రి అయినట్టు ప్రకటించారు. ఇప్పుడు మేం నలుగురు అయ్యాం అని చెప్పారు.
మాకు దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మేమిద్దరం ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి (మనోజ్, మౌనిక) అని పిలస్తున్నాము. మా కుటుంబంపై ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి’ అంటూ ఏఐతో పోస్టర్ విడుదల చేశాడు. పులి ఒడిలో పడుకున్న పాపతో పాటు నలుగురం అయ్యామని మనోజ్ చెప్పిన ప్రయత్నం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సరిగ్గా గత ఏడాది మార్చి 3వ తేదిన పెళ్లి చేసుకున్న ఈజంట ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పింది. మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని..తాను తండ్రిని కాబోతున్నట్లుగా తన ట్వీట్ ద్వారా తెలియజేశాడు.
ఇక మంచు మనోజ్.. 2015లో ప్రణీత రెడ్డిని వివాహం చేసుకోగా, కొద్ది రోజుల పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ అనుకోని కారణాలతో ఈ దంపతులు 2019లో విడిపోయారు.ఇక 2023లో భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం. ఇక మనోజ్ ఇప్పుడు కెరియర్లో కూడా బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అంటూ ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో పలువురు సెలబ్రిటీల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు
⭐️ ANNOUNCEMENT 📣
🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 13, 2024