మెలోని-మోదీల మెలోడీ బంధం వైరల్!

ఇటలీ పర్యటనలో ప్రధానులు.. మోదీ, మెలోనీల ఆత్మీయ పలకరింపులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో మరోసారి మెలోడీ మూమెంట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మెలోనీకి మోదీ తమ రెండు పేర్లు కలిసేలా ఉండే పార్లె మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను బహుమతి ఇవ్వడం వైరల్ అవుతుంది.

మెలోని-మోదీల మెలోడీ బంధం వైరల్!

భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఇటలీ ప్రధాని మెలోని చూపిన అభిమానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీకి చేరుకున్నారు. ఆయనకు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు. పర్యటనలో మోదీ, మెలోనీల ఆత్మీయ పలకరింపులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో మరోసారి మెలోడీ మూమెంట్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మెలోనీకి మోదీ తమ రెండు పేర్లు కలిసేలా ఉండే పార్లె మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను బహుమతి ఇవ్వడం వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో గంటలోనే అర మిలియన్ వ్యూస్ అందుకోవడం విశేషం.

దౌత్య చర్చల కోసం రోమ్‌కు చేరుకున్న మోదీకి మెలోని విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించారు. అక్కడ వీరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మెలోనీ ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘రోమ్‌కు స్వాగతం మిత్రమా’ అని రాసుకొచ్చారు. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 

ఇటు మోదీ సైతం.. మెలోనీతో కారులో ప్రయాణం, విందు, కొలెసియంను సందర్శించిన చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నారు. రోమ్‌ లో దిగిన వెంటనే ప్రధాని మెలోనీతో కలిసి రాత్రి భోజనం చేశాను. అనంతరం ప్రతిష్టాత్మక కొలెసియంను సందర్శించాం. మేము పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్‌- ఇటలీ సంబంధాల బలోపేతానికి జరగనున్న చర్చల కోసం ఎదురుచూస్తున్నాను అని మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు.

 

రోమ్‌లో కాశీ దర్శనం!

ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో మరో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రాక రోమ్ నగరంలో ఆధ్యాత్మిక పట్టణం వారణాసి దర్శనమిచ్చింది. ఇటాలియన్ చిత్రకారుడైన జియాంపాలో టోమాసెట్టి వారణాసిపై తాను రూపొందించిన కళాకృతులను మోదీ పర్యటనలో ప్రదర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ సంస్కృతి పట్ల జియాంపాలోకు ఉన్న మక్కువ నాలుగు దశాబ్దాలకు పైగా నాటిదని తెలిపారు. 1980వ దశకంలో, వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలతో చిత్రకారుడిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2008 నుండి 2013 వరకు మహాభారతానికి సంబంధించిన 23 భారీ చిత్రాలను ఆయన అద్బుతంగా గీశారంటూ మోదీ కొనియాడారు.

 

ఇవి కూడా చదవండి :

జలమండలి జీఎం అక్రమాస్తుల చిట్టా పెద్దదే!
Singer | ప్రేమ పేరుతో దారుణం.. అదృశ్యమైన పంజాబీ సింగర్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం