Women Fight In Delhi Metro | మెట్రో రైలులో సివంగుల సిగపట్లు !

Women Fight In Delhi Metro | మెట్రో రైలులో సివంగుల సిగపట్లు !

విధాత : బస్సు ప్రయాణాల్లో మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం తరచూ చూస్తుంటాం. ఇటీవల ఏపీ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణ వసతి వచ్చాక ఇలాంటి ఘటనలు మరింత వెలుగుచూస్తున్నాయి. అయితే బస్సుల్లోనే కనిపించే మహిళల సిగపట్ల పంచాయితీ ఇటీవల మెట్రో రైళ్లలోనూ తరచు చోటుచేసుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు(Delhi Metro)లో ఇటీవల మహిళా ప్రయాణికుల(Women Fight)ఘర్షణలు వైరల్ గా మారాయి. అలాంటి మరో ఘటనే తాజాగా మరోకటి వెలుగు చూసింది. ఇద్దరు మహిళల మధ్య సీటు(Seat disput) విషయమై ఏర్పడిన వాగ్వివాదం ముదిరిపోయి..ఏకంగా రైలులోనే కింద మీద పడి జుట్లు పట్టుకుని..పిడిగుద్దులు…ముష్టిఘతాలతో పరస్పరం తీవ్రంగా కొట్టుకున్నారు.

రైలు బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోయినా వారు ఇలా కొట్టుకోవడం కొంత విస్మయపరిచింది. తోటి ప్రయాణికులు వారిద్దరిని విడిపించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా పరస్పరం జుట్లు పట్టుకుని తిట్టుకుంటూ ఫైటింగ్ కొనసాగించారు. అతి కష్టం మీద వారిని తోటి ప్రయాణికులు విడిపించగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.