Nara Bhuvaneswari| నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు
ఏసీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025కి ఎంపికైంది. ప్రజాసేవ, సామాజిక అంశాల్లో కీలకంగా పని చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందిస్తున్నట్టు ఐఓడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) సంస్థ ప్రకటించింది.

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari)ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025కి(Distinguished Fellowship Award) ఎంపికైంది. ప్రజాసేవ, సామాజిక అంశాల్లో కీలకంగా పని చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందిస్తున్నట్టు ఐఓడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) సంస్థ ప్రకటించింది. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో నవంబరు 4న జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు.
భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ అవార్డు వరించడం పట్ల ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, సామాజిక రంగాల్లో ఆమె సేవలను గుర్తిస్తూ అవార్డు వరించిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్టును, బ్లడ్ బ్యాంకును భువనేశ్వరి విజయవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. తన సోదరిని అత్యున్నత అవార్డు వరించడం చాలా గర్వకారణమన్నారు. ఆమె ఏ పని చేపట్టినా ఉన్నత శిఖరాలకు ఎదగాలని రామకృష్ణ ఆకాంక్షించారు.