PC Ghosh Report| ఆ అధికారుల నుంచి 6.7 కోట్లు..తిరిగి వసూలు చేయండి!

హైదరాబాద్, విధాత: వ్యాప్కోస్ నివేదిక(Vyapcos report)ను పక్కనపడేసిన అధికారుల నుంచి వ్యాప్కోస్‌కు చెల్లించిన 6.7 కోట్ల రూపాయలను తిరిగి వసూలు(Recovery)చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Report) సిఫారసు చేసింది. విధానపరమైన, ఆర్థికపరమైన బరితెగించిన అవకతవకలకు ప్రబలమైన తార్కాణం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు(Kalashwaram Project)అని కమిషన్ అభిప్రాయపడింది. కమిషన్ ఈ కింది సిఫారసులు చేసింది.
1. నిధుల రికవరీ- వ్యాప్కోస్ నివేదికను షపక్కనపడేయడానికి కారకులైన అధికారుల నుంచి (వ్యాప్కోస్‌కు చెల్లించిన) 6.7767 కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.2. కుమ్మక్కుపై దర్యాప్తు- ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ దురుద్దేశపూర్వకంగా కుమ్మక్కయి అంతర్గతంగా, అనైతికంగా, చట్టవిరుద్ధంగా భారీ ప్రయోజనం పొందడానికి మేడిగడ్డ బరాజు నిర్మాణంపై ప్రజాధనాన్నిఅసాధారణ రీతిలో ఖర్చు చేయడంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని సూచించింది.
తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి కావలసిన ఈ ప్రాజెక్టు వ్యక్తిగత స్థాయిలో నిర్ణయాలు, రాజకీయ నాయకత్వం అసాధారణ జోక్యం, పాలన, ప్రణాళికా, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ వైఫల్యాల వల్ల ప్రజాధనాన్ని అత్యంత వృధా చేసిన ప్రాజెక్టుగా మిగిలిపోయింది అని నివేదిక పేర్కొంది.