ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది.

విధాత, హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం దక్కనుంది.

విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకుంటున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి సూచించింది.

అర్హతలు ..

కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి.

దరఖాస్తు చేసే నాటికి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.

గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

GRE-260 లేదా GMAT-500 స్కోర్ కలిగి ఉండాలి.

TOEFL-60 మార్కులు లేదా IELTS-6.0 లేదా PTE-50 మార్కులు స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి.

అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ను సందర్శించాలని సూచించింది.

వెబ్‌సైట్: http://www.telanganaepass.cgg.gov.in

Latest News