Prakash Raj| ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ఫైర్

ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(Narendra Modi)పై తరుచు విమర్శలు గుప్పించే సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)మరోసారి ఎక్స్ వేదికగా విమర్శల దాడి కొనసాగించారు. ఎన్నికల కమిషన్(EC) ఓట్ల అక్రమాల(Fake votes)కు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను ప్రకాష్ రాజ్ ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదం(Democracy in danger)లో పడిందని ట్వీట్ చేశారు. ప్రతి దేశభక్తుడు, భారతీయుడు దీనిని చూడాలని నేను అభ్యర్థిస్తున్నానన్నారు.
మన వాయిస్ దొంగిలించబడిందని..ఇది తీవ్రమైన నేరం అని..ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించారని పేర్కొన్నారు. మరి నకిలీ ఓట్లపై ప్రధాని మోదీ ప్రెస్ మీట్ పెట్టగలరా? అని..జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా మోదీని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ పలు ఆధారాలను రాహుల్ గాంధీ నిన్న వెల్లడించారు. అయితే రాహుల్ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈ వివాదంలో ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా చేయగా..ఇండియా కూటమి పార్టీలు రాహుల్ గాంధీకి మద్దతుగా గళమెత్తుతున్నాయి.