Retired ENC Muralidhar Rao| ఏసీబీ అదుపులో రిటైర్డ్ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు
విస్తృతంగా సోదాలు
విధాత, హైదరాబాద్ : రిటైర్డు నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్‌రావును జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనన విచారించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌తో పాటు మురళీధర్‌రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో 10చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో ఈఎన్‌సీ జనరల్‌గా పనిచేసిన మురళీధర్ రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ గా పని చేసిన మురళీధర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది.