రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి 1000రోజుల పాలనలో సాధించింది కేవలం ఓ మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమైనప్పటికి..ఆమెతో సహా కూతురు సుస్మితలు సీఎం రేవంత్ రెడ్డిపైన, మంత్రులపైన చేసిన అవినీతి ఆరోపణలు సంగతి ఏమిటన్న అంశాన్ని మేం ప్రశ్నిస్తున్నామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి 1000రోజుల పాలనలో సాధించింది కేవలం ఓ మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమైనప్పటికి..ఆమెతో సహా  కూతురు సుస్మితలు  సీఎం రేవంత్ రెడ్డిపైన, మంత్రులపైన చేసిన అవినీతి ఆరోపణలు సంగతి ఏమిటన్న అంశాన్ని మేం ప్రశ్నిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లక్ష కోట్ల విలువైన 20కి పైగా  కుంభకోణాలను బహిర్గతం చేశామని చేశామని, వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.

వాటిపై దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటిదాకా స్పందన లేదన్నారు. వాస్తవానికి మేం లేవనెత్తిన సీఎం ఆఫీస్ అవినీతి అక్రమాలనే కొండా సురేఖ కూతురు సుస్మిత బయటపెట్టిందన్నారు. అయితే దోపిడి సొమ్ము పంచుకోవడంలో దొంగలు పేచి పెట్టుకుని పోలీసులకు దొరికిపోయినట్లుగా …ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్రజల ముందర దొరికిపోయారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. దొంగతనం చేసినవాడిని వదిలేసి దొంగను పట్టించిన వాడిని అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ హైకమాండ్ తీరు ఉందని విమర్శించారు. కొండా సురేఖ, సుస్మితలు సీఎం రేవంత్ రెడ్డిపైన, మంత్రులపైన చేసిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ చేయాలని, సురేఖ కంటే ముందు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు మంత్రులపైన కూడా చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. కొండా సురేఖ, సుస్మిత ఆరోపణలతో మొదలైన కాంగ్రెస్ పాలకుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడబోతుందని, కాంగ్రెస్ పతనం ఆగబోదని అన్నారు.

నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డిపైన రూ.50 కోట్లకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నాడని ఆరోపించారని, ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతున్నారని ఆరోపించారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు దొరికిన కుంభ కోణాలు, అవినీతి వివరాలు 20కి పైగా ఉంటే..దొరకనివి ఎన్ని ఉన్నాయో ఆలోచించాల్సి ఉందన్నారు. అవన్ని కూడా నిరూపించబడే కాంగ్రెస్ పాలకుల అవినీతి, నేరాలేనని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ మంత్రి పొంగులేటి ఇంటిపై దాడి చేసి ఇప్పటిదాకా వివరాలు వెల్లడించని తీరుతో కేంద్రం, చంద్రబాబు సహకారం ఉందని అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతామని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల అక్రమ సంపాదనలను ప్రజలముందుంచుతామన్నారు.

అది భూ భారతి కాదు.. భూ హారతి

22ఏలో మా భూములు పెట్టి మమ్మల్నే అడుగుతారా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి దగ్గరికి, రేవంత్ దగ్గరికి పోయి మా భూములన్న వదలండని మంత్రులు బ్రతిమిలాడుకుంటున్నారని, ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే ఉందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ హక్కుదారుడికి తప్ప అధికారులకు మార్చే అవకాశం లేకుండా, అక్రమంగా భూములు గుంజుకోకుండా ఉండేందుకు ధరణి తెచ్చారు అని జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడే కొందరు లంచగొండి అధికారులు.. ధరణి ఉంటే అధికారంలోకి వచ్చాక మీరు తినలేరు, మమ్మల్ని తిననీయరని కాంగ్రెస్సోళ్లకు సలహా ఇచ్చారు అని, ఆ సలహాతోనే ధరణి తీసేసి భూ భారతి తెచ్చి.. కోటి ఎకరాల భూములను నిషేధంలో పెట్టి.. యజమానుల్ని భయపెట్టి భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. కొందరు మంత్రుల భూములని తెలియక వాళ్ల బినామీలని పిలిచి నిషేధిత జాబితాలో నుండి తీసేస్తామని 30 శాతం కమిషన్ ఇవాలని పైరవీకారులు అడిగారు అని, ఇది తెలంగాణలో నేడు కాంగ్రెస్ పాలన అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్కలు నిషేధిత భూముల పేరుతో కమిషన్ల దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణకు కాంగ్రెస్ పాలనలో ద్రోహం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతోంది రాహుల్ గాంధీ కాదు… చంద్రబాబు నాయుడేనని జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులకు నీళ్లిస్తే కరెంట్, ఎరువులు, బోనస్ పంచాయితీలు వస్తాయని కావాలనే నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన అంతా ద్రోహం, 420 హామీల మోసమేనన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి కమీషన్ల కొట్లాటల్లో మునిగిపోయారని విమర్శించారు. అలాగే కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన మాకు లేదు.. మా వైపు నుండి ఆ ప్రయత్నం కూడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు మళ్లీ కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్నాయని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను నిరూపయోగంగా మార్చేశారని, కమిషన్లు రావని సింగరేణి బొగ్గు కొనుగోలు చేయడం లేదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

 

Latest News